Cricketers Washroom: క్రికెట్ ఆడుతుండగా అర్జంట్ గా టాయిలెట్ వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఇక ఇలా కాకుండా బ్యాట్స్ మెన్స్ లో ఎవరికైనా టాయిలెట్ వస్తె వాళ్లు ఎంపైర్ కి చెప్పి వెళ్లడం జరుగుతుంది.అయితే ఆ బ్యాట్స్ మెన్ టాయిలెట్ కి వెళ్లి వచ్చే వరకు ఎంపైర్ అందరికీ దాన్ని డ్రింక్స్ బ్రేక్ గా కన్వర్ట్ చేసి 2 మినిట్స్ పాటు బ్రేక్ ఇస్తాడు.

Written By: Gopi, Updated On : September 24, 2023 9:42 am

Cricketers Washroom

Follow us on

Cricketers Washroom: ప్రపంచంలో చాలామందికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది. కొందరికి ఆడడం అంటే ఇష్టం మరి కొందరికి క్రికెట్ చూడడం అంటే ఇష్టం… మొత్తానికి అయితే క్రికెట్ అంటే మాత్రం అందరికీ ఇష్టం ఉంటుంది. అయితే క్రికెటర్స్ క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు వాళ్లకి టాయిలెట్ వస్తే ఏం చేస్తారు అనే ఒక డౌట్ అయితే అందరికీ ఉంటుంది. మామూలుగా క్రికెటర్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కనక టాయిలెట్ వచ్చినట్లయితే ఇంకో ప్లేయర్ ని సబ్ స్ట్యుడ్ గా పెట్టి ఆయన టాయిలెట్స్ కి వెళ్లడం జరుగుతుంది.

ఇక ఇలా కాకుండా బ్యాట్స్ మెన్స్ లో ఎవరికైనా టాయిలెట్ వస్తె వాళ్లు ఎంపైర్ కి చెప్పి వెళ్లడం జరుగుతుంది.అయితే ఆ బ్యాట్స్ మెన్ టాయిలెట్ కి వెళ్లి వచ్చే వరకు ఎంపైర్ అందరికీ దాన్ని డ్రింక్స్ బ్రేక్ గా కన్వర్ట్ చేసి 2 మినిట్స్ పాటు బ్రేక్ ఇస్తాడు. అయితే ఇదంతా టీవీ ముందు మ్యాచ్ చూసే వాళ్లకు తెలియదు.
ఎందుకంటే ఇదంతా జరిగినప్పుడు టీవీలో అడ్వటైజ్ మెంట్ వస్తుంది కాబట్టి టీవీలలో మ్యాచ్ చూసే వాళ్లకి ఇదంతా తెలియదు, స్టేడియంలో మ్యాచ్ చూసే వాళ్లకు మాత్రం తెలుస్తుంది. అయితే బ్యాట్స్ మెన్స్ కి టాయిలెట్స్ రావడం అనేది చాలా అరుదు గా జరుగుతుంది.

ఎందుకంటే వాళ్లు గ్రౌండ్ లో రున్స్ కోసం ఎప్పుడు పరిగెత్తుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకున్న డ్రింక్స్ మొత్తం చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ స్టమక్ అప్సెట్ అయి ఏదైనా ప్రాబ్లం జరిగి టాయిలెట్స్ వస్తే తప్ప రెగ్యులర్ గానయితే బ్యాటింగ్ చేసే టైంలో టాయిలెట్ అనేది రాదు.ఇక ఒకవేళ వచ్చిన కూడా ఇదే రకమైన పద్ధతిని పాటిస్తారు.. ఇలా క్రికెట్ లో జరుగుతూ ఉండటం మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఎందుకంటే ప్లేయర్స్ అందరూ కూడా చాలా ఫిట్ గా ఉంటారు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు కాబట్టి ఇలా మ్యాచ్ టైం లో టాయిలెట్ రావడం మనం అరుదుగా చూస్తుంటాం…