Revanth Reddy : 30 రోజుల రేవంత్ రెడ్డి పాలనలో సానుకూల, ప్రతికూల అంశాలేంటి?

విజుబుల్ ఎఫెక్ట్ గా చూస్తే రేవంత్ రెడ్డి నిర్ణయాలు బాగున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందిపెట్టకుండా జనంతోపాటు ప్రయాణించడం రేవంత్ రెడ్డికి మంచిమార్కులు లభించాయి. గవర్నెన్స్ చూస్తే కొత్త ఐడియాలు అమలు చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : January 9, 2024 1:24 pm

Revanth Reddy : రేవంత్ రెడ్డి.. పరిపాలనలోకి వచ్చి 30 రోజులు నెల పూర్తయ్యింది. అఫ్ కోర్స్ 30 రోజులు అంచనావేయడానికి చాలా తక్కువ సమయం. ఎవరికైనా అది కనీస సమయం కాదు. రేవంత్ రెడ్డి పరిపాలనపై సమగ్ర విశ్లేషణ చేయడం అనేది సాధ్యం కాదు.

అయితే రేవంత్ రెడ్డి పాలన ఎలా నడుస్తుందనేది మనం అంచనా వేయవచ్చు. దీన్ని మూడు రకాలుగా విభజించవచ్చు. స్టేల్ ఆఫ్ గవర్నెన్స్, రెండు గవర్నెన్స్, మూడు రాజకీయం. స్టేల్ ఆఫ్ గవర్నెర్స్ చూసుకున్నప్పుడు కేసీఆర్ ను నిన్నటిదాకా చూసిన జనం.. ఇప్పుడు రేవంత్ రెడ్డిని పోల్చి చూస్తున్నాం. వ్యక్తిత్వాలను అంచనావేస్తున్నారు.

కేసీఆర్ తో వ్యక్తిత్వంను బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి మంచి మార్కులు పడ్డాయి. అందరితో కలిసిపోవడం.. స్వేచ్ఛగా వ్యవహరించడం.. ప్రజల్లోకి వెళ్లడం చేస్తూ అందరి మనసు దోచుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో కామన్ మ్యాన్ సెక్రటేరియట్ లోకే అడుగు పెట్టనీయలేదు. ప్రగతిభవన్ లోకి ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంట్రీనే లేదు. ప్రజాపాలనతో అందరికీ సీఎం వద్దకు చేరడానికి ఆస్కారం లభించింది.

విజుబుల్ ఎఫెక్ట్ గా చూస్తే రేవంత్ రెడ్డి నిర్ణయాలు బాగున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందిపెట్టకుండా జనంతోపాటు ప్రయాణించడం రేవంత్ రెడ్డికి మంచిమార్కులు లభించాయి. గవర్నెన్స్ చూస్తే కొత్త ఐడియాలు అమలు చేస్తున్నారు.

30 రోజుల రేవంత్ రెడ్డి పాలనలో సానుకూల, ప్రతికూల అంశాలేంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.