ఏ కాలంలోనైనా లభించే కాయగూరలలో గోరుచిక్కుడు ఒకటనే సంగతి తెలిసిందే. గోరుచిక్కుడులో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న గోరుచిక్కుడును తీసుకుంటే అందులో ఉండే పీచు శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. మహిళలకు ప్రసవం తర్వాత ఏర్పడే రుగ్మతలను నయం చేయడంలో గోరుచిక్కుడు సహాయపడుతుంది.
Also Read: మొక్కజొన్న తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
చ్యమొప్సిస్ తెత్రగొనొలబ పేరుతో వృక్షశాస్త్రంలో పిలవబడే గోరుచిక్కుడు గర్భిణీ స్త్రీలకు ఉత్తమమైన వంటకం అని చెప్పవచ్చు. గర్భిణీ స్త్రీలకు పిండం యొక్క సాధారణ అభివృద్ధిని ప్రేరేపించడంలో గోరుచిక్కుడు సహాయపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే గోరుచిక్కుడు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. గోరుచిక్కుడులో ఉండే ధాతువులు, కార్బోహైడ్రేట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Also Read: నల్ల ఉప్పు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
గోరుచిక్కుడు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను చంపి క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి అవసరమైన ఆహార ఫైబర్స్ ను గోరుచిక్కుడు కలిగి ఉంటుంది. ఆహారంలో గోరుచిక్కుడును తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. గోరుచిక్కుడు పళ్లు, ఎముకలను రక్షించడంలో సహాయపడుతుంది. గోరుచిక్కుడు చర్మ సంబంధిత సమస్యల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
రక్తహీనత సమస్యతో బాధ పడేవాళ్లు గోరుచిక్కుడును డైట్ లో చేర్చుకుంటే మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. చర్మంపై వచ్చే ముడతలు, దెబ్బ తిన్న కణాలు, డార్క్ మచ్చలను తొలగించడంలో గోరుచిక్కుడు సహాయపడుతుంది. గోరుచిక్కుడులో ఉండే లో కేలరీలు ఒబెసిటీ బారిన పడకుండా చేయడంలో రక్షిస్తాయి.