Meera Mithun: కోలీవుడ్ నటి మీరా మిథున్ చాలా బోల్డ్. ఉన్నది ఉన్నట్టు కాకుండా లేనిది కూడా ఉన్నట్టు మాట్లాడటంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఆ మధ్య చెత్త సినిమాలకు, ప్రతిభ వెనుక పడటానికి కులమే ప్రధాన కారణమని చాలా ఘాటుగా కామెంట్స్ చేసింది. అయితే, మీరా మిథున్ ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఆమెకు మాత్రం నెటిజన్ల ఫాలోయింగ్ తగ్గడం లేదు.
నిజాలు మాట్లాడే హీరోయిన్ గా తనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆమె తెగ ఎగ్జైట్ అయిపోతుంది. తాజాగా, మీరా మిథున్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో కులం పై చాలా లోతుగా మాట్లాడింది. కానీ, ఎక్కడో మీరా మిథున్ లో కులంహకార స్వభావం కనిపిస్తోందని పై దళితులు సీరియస్ అవుతున్నారు.
ఈ మధ్య నెటిజన్లు కూడా మీరా మిథున్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు. అసలు మీరా మిథున్ అభిప్రాయం ఏమిటంటే.. దళిత కులానికి చెందిన దర్శకులు, నటీనటుల వల్లే చెత్త సినిమాలు వస్తున్నాయట. ఈ ముక్క గతంలో చెప్పింది. తాజాగా మరో ముక్క చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీ బాగు పడాలంటే.. ఉన్నతమైన ముఖ్యంగా అగ్ర కులాల వారికే పట్టం కట్టాలట.
Also Read: Pushpa: ‘పుష్ప’ను వెంటాడుతున్న సెన్సార్ కష్టాలు.. అక్కడ ఈరోజే?
అప్పుడే మంచి సినిమాలు వస్తాయట. ఈ డిజిటల్ యుగంలో ఆకాశమే హద్దుగా అందరూ అభివృద్ధి చెందాలని ప్రయత్నాలు చేస్తుంటే.. మీరా మిథున్ మాత్రం ఇంకా కులం పై, చెత్త సినిమాల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే కాలం నెట్టుకొస్తోంది. అయినా ఇలాంటి కామెంట్లు ఆమెకు కొత్తేమి కాదు. గతంలో ఓ సందర్భంలో దళితులను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లగొట్టాలని ఆమె పబ్లిక్ గా స్టేట్ మెంట్స్ ఇచ్చింది.
పై వ్యాఖ్యలను బట్టి మీరా మిథున్ ఏమిటో అర్ధం అవుతుంది. మరి దళిత సంఘాల నేతలు మీరా మిధున్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరతారో చూడాలి.
Also Read: RRR: రికార్డుల వేట మొదలుపెట్టిన ‘ఆర్ఆర్ఆర్’.. 100 మిలియన్ల వ్యూస్‌కు చేరుకున్న ట్రైలర్