Virat Kohli – Rohit Sharma : బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ కోహ్లీ, రోహిత్ తోపులే…

బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ కోహ్లీ, రోహిత్ తోపులే...

Written By: NARESH, Updated On : November 13, 2023 11:05 am
Follow us on

Virat Kohli and Rohit Sharma : వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీం వరసగా తొమ్మిదొ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచ్ తో వరల్డ్ కప్ లో లీగ్ దశ ని ఇండియన్ టీమ్ పరిపూర్ణంగా ముగించింది.ఇక ఈనెల 15వ తేదీన న్యూజిలాండ్ తో ఇండియా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది…

ఇక ఇది ఇలా ఉంటే నిన్న బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్ మీద ఆడిన మ్యాచ్ లో ఇండియా 160 పరుగుల తేడాతో ఘన ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న ఇండియన్ టీం నిర్ణీత 50 ఓవర్లకి 410 పరుగులు చేసింది. అందులో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరు సెంచరీలు చేయగా, రోహిత్ శర్మ ,విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ ముగ్గురు కూడా హాఫ్ సెంచరీలను నమోదు చేశారు. ఇక దాంతో ఇండియా ఇంత భారీ స్కోరు అయితే చేయగలిగింది.ఇక 411 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టీమ్ కి మొదట్లోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారత బౌలర్ల దాటికి ఎదుర్కోలేక నెదర్లాండ్స్ ప్లేయర్స్ చతికలబడ్డారు.

ఇక అందులో భాగంగానే కింగ్ కోహ్లీ,రోహిత్ శర్మ ఇద్దరు కూడా బౌలర్లు గా కొత్త అవతారం ఎత్తారు. ముఖ్యంగా ఆల్ రౌండర్లు గా మారి ఆల్ రౌండ్ షో చేసి టీమ్ కి విజయాన్ని అందించారు.ఇక ఈ మ్యాచ్ లో బౌలర్లకు కొద్దిసేపు రెస్ట్ ఇచ్చి మొదట రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని రంగంలోకి దింపి ఆయన చేత బౌలింగ్ చేయించాడు. ఇక స్వతహాగా విరాట్ కోహ్లీ మీడియం పేస్ బౌలింగ్ వేస్తూ అప్పుడప్పుడు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు ఇక సరిగ్గా ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. నెదర్లాండ్స్ కెప్టెన్ అయిన ఎడ్వర్డ్స్ ని విరాట్ కోహ్లీ తన బౌలింగ్ లో అవుట్ చేశాడు.ఇక కోహ్లీ లెగ్ సైడ్ బాల్ వేయగా ఎడ్వర్డ్స్ బ్యాట్ తో టచ్ చేయడంతో ఆ బాల్ వెళ్లి వికెట్ కీపర్ అయిన కేఎల్ రాహుల్ చేతిలో పడింది.

దాంతో ఎడ్వర్డ్స్ క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు.ఇక ఎడ్వర్డ్స్ వికెట్ తీసిన తర్వాత స్టేడియం మొత్తం ఒక్కసారిగా విరాట్ కోహ్లీ అంటూ నినాదాలు చేయడం జరిగింది.ఇక చివర్లో బౌలింగ్ కి.వచ్చిన రోహిత్ శర్మ అప్పటికే హాఫ్ సెంచరీ చేసి క్రీజ్ లో పాతుకుపోయిన నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్ తేజ నిదమునురు ఆరు సిక్స్ లు, ఒక ఫోర్ తో 39 బంతుల్లో 54 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నపుడు రోహిత్ శర్మ రంగం లోకి దిగి బౌలింగ్ చేసి అతని వికెట్ తీయడం అనేది అద్బుతం అనే చెప్పాలి…తేజ రోహిత్ బౌలింగ్ లో ఒక భారీ షాట్ అడబోయి షమీ చేతికి చిక్కాడు.ఇక అప్పుడు స్టేడియం మొత్తం రోహిత్ అంటూ మారుమ్రోగుతుంది.

ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ,రోహిత్ ఇద్దరు కూడా అటు బ్యాట్ తో,ఇటు బాల్ తోను రెండింటితోను తన సత్తా చాటి ఆల్ రౌండ్ షో చేశారు.ఇక ఈ మ్యాచ్ లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన కోహ్లీ 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా… రోహిత్ శర్మ 5 బంతులు వేసి 7 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.ఇలా ఇద్దరు సీనియర్ ప్లేయర్లు పోటా పోటీ గా బౌలింగ్ చేసి వికెట్లు తీయడంతో జూనియర్ ప్లేయర్లు సైతం సీనియర్లు అయిన రోహిత్ కోహ్లీ లు మ్యాచ్ మీద వాళ్ళు చూపించే డెడికేషన్ కి ఫిదా అయిపోయారు…ఇక ఇది చూసిన అభిమానులు ఇక మీదట నుంచి కోహ్లీ,రోహిత్ శర్మ ఇద్దరిని బౌలింగ్ లో కూడా వాడుకోవచ్చు అంటూ చాలా మంది క్రికెట్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…