India vs Netherlands : వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ ఇండియా టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియన్ టీమ్ అద్భుతమైన పర్ఫామెన్స్ ను చూపించి ఈ టోర్నీ లో వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ తో టోర్నీ దశ ముగిసిపోయిన సందర్భంలో ఇక ముందు ఆడబోయే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు కీలకంగా మారబోతున్నాయి. ఇక కప్పు అందుకోవడానికి ఒక రెందునడుగుల దూరం లో ఇండియన్ టీమ్ ఉంది. అందుకే వరుసగా సెమీ ఫైనల్, ఫైనల్ లో గనక ఇండియా విజయం సాధించినట్టయితే ఇండియా వరల్డ్ కప్ లో విశ్వవిజేతగా మూడోసారి తన పేరును నమోదు చేసుకుంటుంది. ఇక నిన్నటి మ్యాచ్ ను కనక మనం ఒకసారి చూసుకున్నట్లయితే…
ఇండియన్ టీం నిన్నటి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి 410 పరుగుల భారీ స్కోరు అయితే చేసింది.ఇక అందులో భాగంగా 411 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టీం 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఇక ఇప్పుడు అదే విషయం మీద చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి.ఎందుకంటే ఇండియన్ టీం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ లాంటి జట్లను 200 పరుగుల లోపే కట్టడి చేసింది. ఇక సౌతాఫ్రికా, శ్రీలంక లాంటి జట్లను అయితే మరి దారుణంగా 100 పరుగుల లోపే కట్టడి చేసింది…కానీ పసి కూన అయిన నెదర్లాండ్స్ టీమ్ మాత్రం ఇండియా మీద 250 పరుగులు చేయడం అనేది మన బౌలర్ల వైఫల్యానికి ఒక కారణమనే చెప్పాలి.
ఇక ఈ క్రమంలో మన బౌలర్లు కొద్దిపాటిగా నిర్లక్ష్యం వహించినట్లు గా కూడా అర్థం అవుతుంది. అలాగే ఫీల్డింగ్ లో కూడా ఆ నిర్లక్ష్యం అనేది స్పష్టం గా కనిపిస్తూ వచ్చింది… అయితే ఇదే నిర్లక్ష్యాన్ని మాత్రం సెమీ ఫైనల్ మ్యాచ్ లో వహిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ని ఒక ప్రాక్టీస్ మ్యాచ్ గా ఆడినట్టుగా భావించి నెక్స్ట్ సెమీ ఫైనల్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే మంచిది…ఇక ప్రాక్టీస్ మ్యాచ్ గా భావించిన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాట్స్ మెన్స్ కూడా ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేసి వికెట్లు తీయడం అనేది ఒక వంతుకు ఇండియన్ టీం కి ఫ్యూచర్ లో కూడా బాగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఎంత ప్రాక్టీస్ మ్యాచ్ అయిన కూడా ఇండియన్ టీమ్ అభిమానుల్లో ఒక అసంతృప్తి అయితే దాగి ఉంది అదేంటంటే పసికూన అయిన నెదర్లాండ్స్ టీమ్ ని 250 పరుగులు ఎలా చేయనిచ్చారు అనే దాని మీదనే ఇప్పుడు చర్చ అనేది నడుస్తుంది.
ముఖ్యంగా బుమ్రా, షమీ, సిరాజ్ లాంటి స్టార్ పేస్ బౌలర్లు ఉన్నప్పటికీ వంద పరుగులు లోపు కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యారు అనే మాటలైతే వినిపిస్తున్నాయి. కానీ ప్రాక్టీస్ మ్యాచ్ గా వాడుకున్నప్పుడు బౌలర్లు పెద్దగా ఇంపాక్ట్ చూపించాల్సిన పనిలేదని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…ఇక ఎది ఏమైనా ఈనెల 15 వ తేదీన జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ మీదనే అందరి ఫోకస్ ఉంది.ఇది గెలిచి వరుసగా 10 వ విజయాన్ని అందుకొని ఇండియా ఫైనల్ కి వెళ్తుందా లేదా అనేది చూడాలి…