KCR National Politics : నిన్న జరిగిన కేసీఆర్ బీఆర్ఎస్ సభ.. ఆయన పంచుకున్న ఆలోచనలు ఒకసారి సమీక్ష చేసుకుంటే.. కేసీఆర్ దేశానికి లక్ష్యం లేదన్నట్టుగా మాట్లాడాడు… మరి కేసీఆర్ లక్ష్యం ఏంటో అర్థం కావడం లేదు. ఇందిరాగాంధీ విధానాలను.. సోషలిస్టు విధానాలను.. ప్రపంచం వదిలిపెట్టిన లక్ష్యాలను తీసుకొచ్చి ఇవే 21వ శతాబ్ధపు ప్రణాళికలు అని విడమరిచి చెబుతున్నారు. కేసీఆర్ కు ఆర్థిక శాస్త్రంపై ఎంత పట్టుందన్నది తెలియదు.
మొత్తం 75 సంవత్సరాల ఆర్థిక భారతంలో అతి తక్కువ వృద్ధిరేటు ఉన్నది ఇందిరాగాంధీ హయాంలోనే.. నెహ్రూ నుంచి మోడీ వరకూ చూసుకుంటే.. ఇందిరాగాంధీనే ఫ్లాప్ పాలకురాలిగా ఉంది. ఇందిరా విధానాలనే కేసీఆర్ వల్లవేశారు.
చైనా గురించి కేసీఆర్ కోట్ చేశారు. 1980 తర్వాత డెంగ్ చావీవ్ అధ్యక్షుడయ్యాక ఆయన ప్రైవేటీకరణకు బాటలు వేశాడు. సోషలిస్ట్ విధానాలను పక్కనపెట్టి పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు పెట్టించి చైనాను ప్రపంచ కర్మాగారంగా మార్చాడు. ఎందుకు చైనా ముందుకెళ్లిందంటే మార్కెట్ సంస్కరణలే. ఆ ప్రైవేటు రంగ ప్రోత్సాహంతోనే చైనా ఆస్థాయికి ఎదిగారు.
ఆర్థిక విధానాలపై ఏమాత్రం అవగాహన లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఖమ్మంలో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడిన విధానంపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడండి..