రివ్యూ : ‘రొమాంటిక్’ !
నటీనటులు : ఆకాష్ పూరీ, కేతిక శర్మ, రమ్య కృష్ణ
ప్రొడ్యూసర్: పూరీ జగన్నాథ్
డైరెక్షన్ : అనిల్ పాదూరి
మ్యూజిక్ : సునీల్ కశ్యప్
రిలీజ్ డేట్ : అక్టోబర్ 29, 2021

Romantic Movie
Romantic Movie Review: పూరి జగన్నాథ్ ఎలాగైనా తన కొడుకును హీరోగా నిలబెట్టాలని స్వయంగా కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసి నిర్మించిన సినిమా ‘రొమాంటిక్’. ఆకాష్ – కేతిక జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.
కథ :
చెప్పుకోటానికి పెద్దగా కథ ఏమి లేదు, ఉన్న కథనే ముచ్చటించుకుంటే.. వాస్కోడగామా (ఆకాశ్ పూరీ) ఓ రౌడీ గ్యాంగ్‌లో చేరి ఒక స్మగ్లర్ గా ఎదుగుతాడు. ఈ క్రమంలోనే వాస్కోడగామాకు మౌనిక(కేతిక శర్మ) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మరి వీరి ప్రేమ కథలో చోటు చేసుకున్న సమస్యలు ఏమిటి ? అసలు వీళ్ళది ప్రేమేనా? లేక మోహమా ? ఇక ఈ మధ్యలో రమ్య గోవారికర్ (రమ్య కృష్ణ) పాత్ర ఏమిటి ? చివరకు వాస్కోడగామా చేసిన తప్పుల నుంచి అతను ఎలా బయటపడతాడు ? అలాగే వాస్కోడగామా, మౌనిక ఫైనల్ గా ఒక్కటి అవుతారా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ సినిమాకి రచయిత పూరి కావడం ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఎమోషనల్ స్టోరీలో బోల్డ్ సీన్స్ పెట్టి ఓ వర్గం ఆడియన్స్ ను పూరి బాగా ఆకట్టుకున్నాడు. దీనికితోడు సినిమాలోని మాస్ ఎలిమెంట్స్ చాలా బాగా కుదిరాయి. ఇక ఆకాష్ పూరిలో ఈ రేంజ్ నటుడు ఉన్నాడా ? అనిపించింది. ఆకాష్ చాలా బాగా నటించాడు. అలాగే కేతిక శర్మ నటన కూడా బాగుంది.
రొమాంటిక్ సన్నివేశాల్లో కేతిక శర్మ నటించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. శృతిమించిన సీన్స్ లో ఒక పెయిన్, ఒక ఎమోషన్ తో నటించడం అంటే.. కచ్చితంగా గొప్ప విషయమే. నేటి జనరేషన్ హీరోయిన్స్ లో ఇలాంటి నటన కలిగిన హీరోయిన్స్ అతి తక్కువ మంది ఉంటారు. వారిలో కేతిక మొదటి ప్లేస్ లో ఉంటుంది.
ఇక పూరి జగన్నాథ్ గతంలో తన తమ్ముడు విషయంలో చేసిన పొరపాట్లను కొడుకు విషయంలో చేయకుండా జాగ్రత్త పడ్డాడు. పూరి స్క్రిప్ట్ పై గట్టిగానే కసరత్తు చేశాడు. అందుకే రొమాంటిక్ సినిమా సాధ్యమైనంత వరకు బోర్ కొట్టకుండా చూసుకున్నాడు. ఎప్పటిలాగే పూరి మాటలు బాగున్నాయి. అలాగే స్క్రీన్ ప్లే ఏవరేజ్ గా ఉంది.
కీలక పాత్రలో నటించిన రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది. అయితే, దర్శకుడు సినిమా మూడ్ ను కొంతవరకు చెడగొట్టాడు. అయినా కథలోకి తీసుకెళ్లేందుకు మంచి సీన్స్ రాసుకోవాలి గానీ, ల్యాగ్ సీన్స్ ను రాసుకుంటూ పోతే స్క్రీన్ ప్లే సక్రమంగా ఉండదనే విషయాన్ని దర్శకుడు అనిల్ తెలుసుకోకపోవడం విచిత్రమే.
ప్లస్ పాయింట్స్ :
ఆకాష్ పూరి, కేతిక శర్మ నటన
పూరి రచన,
సంగీతం,
రొమాంటిక్ అండ్ బోల్డ్ సీన్స్,
సాంగ్స్,
మైనస్ పాయింట్స్ :
ఓవర్ బిల్డప్ సీన్స్,
బోరింగ్ ప్లే,
సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా సాగకపోవడం,
కొన్ని చోట్ల ట్రీట్మెంట్ బాగా లేకపోవడం,
సినిమా చూడాలా ? వద్దా ?
భిన్నమైన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా వైవిధ్యంగా లేకపోయినా కొన్ని బోల్డ్ అండ్ ఎంటర్ టైన్మెంట్ అంశాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా కేతిక గ్లామర్, ఆకాష్ హార్డ్ వర్క్, పూరి రైటింగ్ సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే, నాసిరకమైన సీన్స్, గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమా స్థాయిని తగ్గించింది. ఓవరాల్ గా కమర్షియల్ సినిమా లవర్స్ ఈ సినిమాని చూడొచ్చు.
oktelugu.com రేటింగ్ – 2.75/5
Also Read: రొమాంటిక్ మూవీలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వనున్న… హీరో రామ్