Vangaveeti Radhaa: కావాల్సిన కంటెంట్ దొరకాలే కానీ.. మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు రగిలించినంతగా ఎవరూ రగిలించలేరు. ఆయనకు అనుకూలంగా తెలుగు రాష్ట్రాల్లో బలమైన మీడియా ఉంది. ఇటు పేపర్లు, అటు న్యూస్ చానెల్స్ కాచుకు కూర్చున్నాయి. సందర్భం దొరికితే చాలు ప్రత్యర్థులను చెడుగుడు ఆడేసేలా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రెడీ ఉంటాయి. ఇప్పుడు వంగవీటి రాధా హత్యకు కుట్ర జరుగుతోందని స్వయంగా ఆయన ఆరోపించాక చంద్రబాబు బయటకొచ్చాడు. వైసీపీ టార్గెట్ గా సెంటిమెంట్ రాజకీయాన్ని రగిలిస్తున్నారు.

తన హత్యకు రెక్కీ నిర్వహించారని ఇటీవల ప్రముఖ కాపు నాయకుడు, టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశాడు. తనకు ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇక ప్రభుత్వం స్పందించి 4 గన్ మెన్లను కేటాయించినా.. ప్రజా జీవితంలో ఉండే తనకు ప్రజలే రక్షణ అని వారిని వద్దన్నాడు. సెక్యూరిటీ లేకుండానే ప్రజల్లో తిరుగుతానని ఆయన సెంటిమెంట్ పండించాడు.
Also Read: ఇంతకీ వంగవీటి రాధాను హత్య చేయాలనుకుంటున్నది ఎవరు?
వంగవీటి రాధా రాజేసిన కుంపటిని పెట్రోల్ పోసి మరీ చంద్రబాబు తాజాగా అంటించేశాడు. ‘వంగవీటి రాధాకు ఏం జరిగినా జగన్ ప్రభుత్వానిదే బాధ్యత’ అని సంచలన ప్రకటన చేశఆడు. ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాసి ముందస్తుగా ఫ్రూఫ్ గా పెట్టుకున్నాడు. రాధాపై జరిగిన రెక్కీ విషయంలో విచారణ జరిపి.. దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని చంద్రబాబు సెటిమెంట్ ను పతాకస్థాయికి తీసుకెళ్లారు. రాధాకు ఏమైనా జరిగితే జగన్ పై నెపాన్ని నెట్టడానికి కావాల్సిన అవకాశాన్ని ఫుల్లుగా వాడుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా రాధాను లక్ష్యంగా చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఇలా రాధాను బేస్ చేసుకొని ఏపీలో ఆయనకు మద్దతుగా ఉన్న కాపుల్లో ఇమేజ్ పెంచుకోవడానికి చంద్రబాబు బాగానే ట్రై చేస్తున్నారు. వైసీపీకి కాపులను దూరం చేసే ఎత్తుగడను వేస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ రాజకీయం పండుతుందా? లేదా చంద్రబాబు కన్నీళ్లలాగానే కరిగిపోతుందా? అన్నది చూడాలి.