https://oktelugu.com/

Akhanda in Hindi: హిందీలోకి ‘అఖండ’.. అలాగే ‘అఖండ 2’ కూడా ఆగమనం !

Akhanda in Hindi: తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాల‌న్నీ ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ అవడం ఆన‌వాయితీ అయిపోయింది. ఈ క్రమంలోనే కొందరు బాలీవుడ్ బడా నిర్మాతల చూపు.. ఇప్పుడు బాలయ్య ‘అఖండ’ పై ప‌డిందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ వార్తల పై తాజాగా అఖండ సినిమా నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. అఖండ సినిమాను బాలీవుడ్ లో కొందరు రీమేక్ చేస్తామని వచ్చారు. కాబట్టి, బాలీవుడ్ లో అఖండ చిత్రాన్ని […]

Written By:
  • Shiva
  • , Updated On : December 29, 2021 / 12:29 PM IST
    Follow us on

    Akhanda in Hindi: తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాల‌న్నీ ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ అవడం ఆన‌వాయితీ అయిపోయింది. ఈ క్రమంలోనే కొందరు బాలీవుడ్ బడా నిర్మాతల చూపు.. ఇప్పుడు బాలయ్య ‘అఖండ’ పై ప‌డిందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ వార్తల పై తాజాగా అఖండ సినిమా నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు.

    Akhanda in Hindi

    అఖండ సినిమాను బాలీవుడ్ లో కొందరు రీమేక్ చేస్తామని వచ్చారు. కాబట్టి, బాలీవుడ్ లో అఖండ చిత్రాన్ని కచ్చితంగా రీమేక్ చేసే ఛాన్స్ ఉంది. నా దృష్టిలో హిందీలో ఈ సినిమాని రీమేక్ చేస్తే.. ‘అక్ష‌య్ కుమార్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ లలో ఎవరో ఒకరు న‌టిస్తే బాగుంటుంది’ అంటూ మిర్యాల‌ చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా అఖండ 2 పై కూడా మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడారు.

    కథలో ‘అఖండ 2’ కి కూడా మంచి స్కోప్ ఉంది. అందుకే “అఖండ 2 వ‌స్తే బాగుంటుందని నేను బలంగా కోరుకుంటున్నాను. నిర్మాత‌గా అది నా ఆశ కూడా. కాకపోతే, ఈ విషయంలో బోయ‌పాటి శ్రీ‌ను మైండ్ లో ఏముందో నాకు తెలీదు. ఒకవేళ అఖండ 2 చేస్తే చాలా బాగుంటుంది అని మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి తెలిపాడు. ఇక ఈ సినిమా విజయం పై ఆయన స్పందించారు.

    Also Read: అఖండ 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

    “ఈ సినిమా విడుద‌లైన నాలుగు రోజుల్లోనే బ‌య్య‌ర్లు అందరూ కచ్చితంగా లాభాల బాట ప‌డ‌తార‌ని నేను ముందే చెప్పాను. ఆ విషయం నాకు తెలుసు. బాలయ్య గారి ఇమేజ్ గురించి నాకు అవగాహన ఉంది. వాస్తవానికి ఆయన ఇమేజ్ ఓ ప్రత్యేకమైనది. హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ బాలయ్య బాబుకు భక్తులు ఉంటారు.

    అయితే, ఓవ‌ర్సీస్ లో మాత్రం అఖండ సినిమాకు ఇంత భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని నేను ఊహించలేదు. బాలయ్య అభిమానులు గొప్పవాళ్ళు. ఇక బాల‌కృష్ణ‌ గారితో సినిమా చేయ‌డం నాకు దొరికిన గొప్ప అవ‌కాశం. మ‌ళ్లీ మ‌ళ్లీ ఆయ‌న‌తో సినిమాలు చేయాల‌ని ఆశ పడుతున్నాను’ అంటూ మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి చెప్పుకుకొచ్చాడు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ‘పే పర్ వ్యూ’లో.. వర్కౌట్ అవుతుందా ?

    Tags