Eagle: ఈగిల్ మూవీపై హైప్ పెంచేసిన ప్రొడ్యూసర్… ఆ చివరి 40 నిమిషాలు!

విశ్వప్రసాద్ మాట్లాడుతూ... ఈగిల్ సినిమాకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ చిత్రాల్లో మాదిరి గొప్ప ముగింపు ఉంటుంది. అదిరిపోయే ట్విస్ట్స్ ఉంటాయి. చివరి 40 నిమిషాలు థియేటర్స్ లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ కలిగే స్థాయిలో మూవీ ఉంటుందని వెల్లడించారు.

Written By: S Reddy, Updated On : February 8, 2024 6:22 pm

Eagle

Follow us on

Eagle: మరికొన్ని గంటల్లో ఈగిల్ థియేటర్స్ లో దిగనుంది. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగిల్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈగిల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మూవీపై హైప్ మరింత పెంచేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన క్లైమాక్స్ తో పాటు చివరి 40 నిమిషాలు సినిమాలు అద్భుతంగా ఉంటుందంటూ కామెంట్స్ చేశారు.

విశ్వప్రసాద్ మాట్లాడుతూ… ఈగిల్ సినిమాకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ చిత్రాల్లో మాదిరి గొప్ప ముగింపు ఉంటుంది. అదిరిపోయే ట్విస్ట్స్ ఉంటాయి. చివరి 40 నిమిషాలు థియేటర్స్ లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ కలిగే స్థాయిలో మూవీ ఉంటుందని వెల్లడించారు. టీజీ విశ్వప్రసాద్ కామెంట్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతున్నాయి. ఆల్రెడీ రవితేజ ఈగిల్ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా వీక్షించారు. దర్శక నిర్మాతలను అభినందించారు. నేను సినిమా పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు కామెంట్ చేశాడు.

రవితేజ వన్ వర్డ్ రివ్యూ వైరల్ అవుతుంది. మరోవైపు నిర్మాత కూడా ఈగిల్ పతాక సన్నివేశాల గురించి రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నాడు. ఈగిల్ మూవీకి మంచి ఓపెనింగ్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఈగిల్ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. థియేటర్స్ సమస్య నేపథ్యంలో నిర్మాతను ఒప్పించి రేసు నుంచి తప్పించారు. ఈగిల్ కి ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ డేట్ ఏర్పాటు చేస్తాము అన్నారు. చెప్పినట్లే రేపు శుక్రవారం ఈగిల్ సోలోగా విడుదల అవుతుంది.

ఈగిల్ మూవీలో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం విశేషం. ఆయన లుక్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నాయి. ఈగిల్ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవదీప్, మధుబాల కీలక రోల్స్ చేస్తున్నారు. కాగా రవితేజ గత రెండు చిత్రాలు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు నిరాశపరిచాయి. దీంతో ఈగిల్ మూవీతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని రవితేజ భావిస్తున్నారు.