PSPK x NBK First Glimpse : పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ చిన్న విషయాన్నీ అయినా ఆయన అభిమానులు ఎంత పెద్ద సంబరాలు చేసుకుంటారో మన అందరికీ తెలిసిందే.. సౌత్ ఇండియాలో ఇంత పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మరొకరు కనిపించరు..ఎన్ని పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ కొట్టినా పవన్ కళ్యాణ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించడం ఏ హీరో కి అయినా కష్టమే.

అందుకు మరో చిన్న ఉదాహరణగా నిలిచింది రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన..ఆహా మీడియాలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ సీజన్ 2 కి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఒక ఎపిసోడ్ లో పాల్గొనగా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ఎపిసోడ్ లో పాల్గొన్నాడు..ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి ఆహాలో అప్లోడ్ చేసారు..దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది..అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా ఆహా మీడియాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన చిన్న మైక్రో టీజర్ ని నిన్న విడుదల చేసారు..’నీ కొలతలు తీసుకోవాలి అయ్యా’ అని బాలయ్య బాబు అనడం, దానికి పవన్ కళ్యాణ్ పగలబడి నవ్వడం వరకే ఆ ప్రోమో లో చూపించారు..ఎపిసోడ్ కి సంబంధించి కనీసం రెండు మూడు షాట్స్ అయినా పెడతారేమో అని అభిమానులు భావిస్తే కేవలం ఒక పది సెకండ్స్ మాత్రమే పెట్టారంటూ అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.. కానీ అదే మైక్రో టీజర్ ఇప్పుడు డిజిటల్ మీడియా లో రికార్డ్స్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది..ప్రభాస్ ఎపిసోడ్ మైక్రో టీజర్ కి లైఫ్ టైం మొత్తం కలిపి కేవలం మూడు మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి.
కానీ అదే అప్పటి వరకు రికార్డు..అయితే ఆ రికార్డు ని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించిన మైక్రో టీజర్ కేవలం 24 గంటల్లోనే బ్రేక్ చేసింది..ఇక ట్విట్టర్ లో కూడా ఆ ప్రోమో కి సంబంధించిన టీజర్ కి 14 వేలకి పైగా రీట్వీట్స్ వచ్చాయి..ప్రభాస్ ఎపిసోడ్ ప్రోమో ట్వీట్ కి కేవలం 11 వేల రీట్వీట్స్ వచ్చాయి..అలా ఈ బుల్లి టీజర్ సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది.
https://www.youtube.com/watch?v=fBEJBi2m90g