
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ షాక్ ఇచ్చింది. నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎక్కువ వేతనం పొందే ఉద్యోగులకు పన్ను రాయితీలను తగ్గించడానికి సిద్ధమైంది. మోదీ సర్కార్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉన్నవారికి ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ పన్ను రాయితీలను తగ్గించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రతిపాదన చేశారు.
Also Read: అదృష్టమంటే ఈ వ్యక్తిదే.. లాటరీలో ఎన్ని కోట్లు గెలిచాడంటే..?
ఇప్పటివరకు కేంద్రం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాపై వచ్చే వడ్డీ విషయంలో ఎలాంటి పన్నును విధించలేదు. అయితే ఎక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులకు పన్ను మినహాయింపును సవరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. చాలామంది ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో ఎక్కువ మొత్తం జమ చేస్తున్నారని కేంద్రం దృష్టికి వెళ్లగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ చేసినా ఇప్పటివరకు ఎలాంటి పన్ను లేదు.
Also Read: బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు
అయితే పన్ను మినహాయింపు పరిమితిని విధించడం ద్వారా పీఎఫ్ ఖాతాదారులు రెండున్నర లక్షల రూపాయలు దాటిన ఏడాది పీఎఫ్ కంట్రిబ్యూషన్ పై వచ్చిన వడ్డీ మొత్తానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అమలులోకి రానుంది. కేంద్రం కొత్త నిర్ణయం ద్వారా ఎక్కువ మొత్తం ఆదాయం పొందేవారు పీఎఫ్ ఖాతాలో తక్కువ మొత్తం డిపాజిట్ చేస్తారని భావిస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
పీఎఫ్ కంట్రిబ్యూషన్ రెండున్నర లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. పీఎఫ్ అకౌంట్ పై ప్రస్తుతం 8.5 శాతం వడ్డీ లభిస్తుండగా ఉద్యోగి శాలరీ నుంచి 12 శాతం, కంపెనీ పీఎఫ్ అకౌంట్ నుంచి 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమవుతుంది. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు కట్టేవాళ్లపై కేంద్రం నిర్ణయం ప్రభావం పడనుందని తెలుస్తోంది.