https://oktelugu.com/

Chandrababu CID: చంద్రబాబు సీఐడీ విచారణలో అనూహ్య పరిణామం

చంద్రబాబును సిఐడి కస్టడీకి రెండు రోజులు పాటు అప్పగించిన సంగతి తెలిసిందే. శని ఆదివారాల్లో రెండు రోజులపాటు చంద్రబాబు విచారణ కొనసాగనుంది. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి విచారణ ప్రారంభించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Written By:
  • Dharma
  • , Updated On : September 23, 2023 2:10 pm
    Chandrababu CID

    Chandrababu CID

    Follow us on

    Chandrababu CID: చంద్రబాబు కస్టడీ పొడిగింపునకు కుట్ర జరుగుతోందా? అందుకే సిఐడి విచారణను ఆలస్యంగా ప్రారంభించారా? కోర్టు ఉదయం 9:30 గంటలకు ప్రారంభించమంటే.. 11:30 గంటలకు మొదలుపెట్టడం అందులో భాగమేనా? కావాలనే జాప్యం చేశారా? కస్టడీని మరింత పొడిగింపునకే ఇలా చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఇదే అనుమానాన్ని లేవనెత్తుతున్నాయి.

    చంద్రబాబును సిఐడి కస్టడీకి రెండు రోజులు పాటు అప్పగించిన సంగతి తెలిసిందే. శని ఆదివారాల్లో రెండు రోజులపాటు చంద్రబాబు విచారణ కొనసాగనుంది. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి విచారణ ప్రారంభించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం ఐదు గంటల వరకు అనుమతి ఇచ్చింది. కానీ సిఐడి అధికారులు 11:30 గంటల నుంచి విచారణను ప్రారంభించడం విశేషం.కావాలనే జాప్యం చేశారని.. కస్టడీని పొడిగించే ఉద్దేశ్యమేనని ఆరోపణలు వస్తున్నాయి.

    ఓ మాజీ సీఎంను నేరుగా జైల్లోనే విచారణ చేపట్టడం ఏపీ చరిత్రలో మొదటిసారి.దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు పరిసరాల్లో రెండించల భద్రతను ఏర్పాటు చేశారు.సిఐడి డిఎస్పి ధనుంజయుడు నేతృత్వంలో 9 మంది అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ బృందంలో ఒక వీడియో గ్రాఫర్ ఉన్నారు. ప్రతి గంటకు చంద్రబాబుకు ఐదు నిమిషాలు పాటు బ్రేక్ ఇస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకి లంచ్ బ్రేక్ ఇచ్చారు. రెండు గంటల నుంచి తిరిగి విచారణను ప్రారంభించనున్నారు.

    మరోవైపు చంద్రబాబు పై ఎటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేపట్టాలని సూచించింది. ఆయనకు సంబంధించి ఇద్దరు లాయర్లను ఉండడానికి అనుమతించింది.అయితే విచారణ ఆలస్యంగా ప్రారంభం కావడం విశేషం. దీనిని సాకుగా చూపి మరో రెండు రోజులు పాటు కస్టడీ కోరాలని సిఐడి ఎత్తుగడ అని చంద్రబాబు న్యాయవాదులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఐదు రోజులపాటు సిఐడి కస్టడీ కోరగా.. న్యాయమూర్తి మాత్రం రెండు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకసారి కస్టడీకి ఇస్తే ఆ గడువు పెంచే ప్రసక్తి లేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు చెబుతున్నారు.