North Korea: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం(నవంబర్ 5న) ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో అని ప్రపంచమంతా ఉత్కంఠగా చూస్తోంది. ఎవరు గెలిస్తే తమకు మేలో అంచనాలు వేసుకుంటున్నాయి. అమెరికా అంతా ఎన్నికలపై దృష్టిసారించిన వేళ.. అమెరికాకు బద్ధ శత్రువైన ఉత్తర కొరియా దూకుడు ప్రదర్శించింది. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. తూర్పు సముద్రంవైపు పలు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిఫణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షపణులు సముద్రంలో పడిపోయాయని, ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరుగలేదని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇటీవలే ఖండాంతర క్షపణి పరీక్ష..
ఇదిలా ఉంటే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో ఆ దేశం ఇటీవలే ఖండాంతర బాలిస్టిక్ క్షిఫణులను పరీక్షించింది. ఆ దేవం ఇప్పటి వరకు పరీక్షించిన క్షిపణులకంటే బాలిస్టిక్ క్షిఫణి ఎంతో శక్తివంతమైనది. ఈ క్షిపణి ద్వారా అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని ఉత్తర కొరియా గతంలోనే తెలిపింది. దీనికి ప్రతిస్పందనగా యూఎస్ తాజాగా దక్షిణ కొరియా, జపాన్‌తో కలిసి దీర్ఘ శ్రేణి బీ–వన్ బి బాంబర్లను పరీక్షించింది.
శవాలను ప్యాక్ చేసి పంపుతామని..
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఉత్తర కొరియా ఇటీవలే 12 వేల మంది సైనికులను పంపింది. వారు ఉత్తర కొరియాలో అడుగు పెట్టారు. ఈ విషయాన్ని కూడా దక్షిణ కొరియా తెలిపింది. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా సైనికుల శవాలను మూటగట్టి పంపిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు జరపడం గమనార్హం.
హ్వాసాంగ్–19..
ఇదిలా ఉంటే.. ఉత్తర కొరియా పరీక్షించిన శక్తివంతమైన క్షిపిణిని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ హ్వాసాంగ్–19 ఐసీబీఎంగా పేర్కొంది. దీనిని ప్రపంచంలో బలమైన వ్యూహాత్మక క్షిపిణి అని పేర్కొంది. ఈ క్షిపణి పరీక్షను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ వీక్షించారని, అణు దాడి సామర్థ్యాన్ని ప్రదర్శించినందుకు శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారని పేర్కొంది. ఎన్నికల ముంద క్షిపణ పరీక్షలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య బంధాలు మెరుగుపర్చే లక్ష్యంతో కిమ్‌తో భేటీ అయ్యారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: North korea has launched ballistic missiles
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com