ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువగా ఉందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తాజా నివేదిక ఒక ఈ మేరకు బాంబు పేల్చింది. హైదరాబాద్ కు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయని కేసీఆర్ చెప్పుకుంటున్నా.. నివేదికలో హైదరాబాద్ కు పెట్టుబడులు అంతగా రావడం లేదని నివేదిక నిగ్గుతేల్చింది.

హైదరాబాద్ కు పెట్టుబడుల వరద అని ఇప్పటికే కేసీఆర్ సర్కార్, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఊదరగొడుతున్నారు. ఇక ఆఫీస్ స్పేస్ లో దేశంలోనే నంబర్ 2 హైదరాబాద్ అన్నారు.కానీ గ్రోత్ రేట్ లో హైదరాబాద్ నంబర్ 1 కాదని తేలిపోయింది. దేశంలోని ప్రధాన 5 నగరాల్లో హైదరాబాద్ లేకపోవడం అవన్నీ కట్టుకథలు అని తేలిపోయింది.
దేశంలో నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండడం విస్మయపరుస్తోంది. దేశంలో 7శాతానికి పైగా నిరుద్యోగ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఫస్టు కేరళలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, అస్సాం, పంజాబ్, ఉత్తరాఖండ్, తెలంగాణ కూడా టాప్ 7లో ఉండడం కలవరపడుతోంది. మనకంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ కేవలం 4.7 శాతమే. అంటే తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్య ఆంధ్రాలో లేకపోవడం షాకింగ్ గా ఉంది.
ఈ క్రమంలోనే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎక్కువనా? ముంబై, బెంగళూరు, పూణేతో కూడా హైదరాబాద్ పోటీపడడం లేదని తేలిపోయింది. కేసీఆర్ సర్కార్ చెబుతున్నవన్నీ కాకి లెక్కలా? తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందా? క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను ఈ వీడియోలో చూడొచ్చు.