twitter deal temporarily on hold tweets elon musk: ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరికీ అంతుబట్టని ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ ఇటీవల ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక ట్విట్టర్ ను హస్తగతం చేసుకోవడమే మిగిలింది అనుకుంటున్న టైంలో తాజాగా ఎలాన్ మస్క్ మరో షాకిచ్చాడు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

ట్విట్టర్ డీల్ కు తాత్కాలికంగా బ్రేక్ పడిందని ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం సంచలనమైంది. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ట్విట్టర్ స్పామ్ నుంచి బాట్స్ ను తొలగించడం తన ప్రాధాన్యతల్లో ఒకటి అని ఎలాన్ మస్క్ అన్నారు.
Also Read: RRR OTT Trailer : మైండో బ్లోయింగ్ విజువల్స్.. ఓన్లీ ఫర్ ఓటీటీ.. ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..
ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నట్టు గతంలో ప్రకటించారు. తాజాగా ఈ డీల్ కు తాత్కాలికంగా బ్రేక్ పడిందని ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. స్పామ్, నకిలీ ఖాతాలను పరిగణలోకి తీసుకుంటే వాస్తవానికి కన్నా 5శాతం కంటే తక్కువ యూజర్లను ట్విట్టర్ సూచిస్తోందని.. ట్వీట్టర్ యూజర్ల లెక్కకు మద్దతునిచ్చే వివరాలు పెండింగ్ లో ఉన్నాయని మస్క్ ట్వీట్ చేయడం విశేషం. అందుకే స్పామ్ బాట్స్ ను తొలగించడమే తన ప్రాధాన్యతల్లో ఒకటని అన్నారు.
ఎలాన్ మస్క్ ట్వీట్ తో ట్విట్టర్ షేర్లు 20శాతం పతనం అయ్యాయి. దీనిపై ట్విట్టర్ మాత్రం స్పందించాల్సి ఉంది. ఎలాన్ మస్క్ తో ఒప్పందం ముగిసే వరకూ ప్రకటనదారులు ట్విట్టర్ లో ప్రకటనలు కొనసాగించాలా? వద్దా? అనే దానితో సహా ఇతర రిస్కులు ఉన్నట్టు కంపెనీ తెలిపింది.
ట్విట్టర్ ను కొన్నాక ఆ కంపెనీలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. టాప్ లో ఉండే అగ్ర నాయకత్వాన్ని మార్చేస్తున్నారు. ఇప్పటికే వినియోగదారుల ప్రొడక్ట్ లీడర్, రెవెన్యూ ప్రొడక్ట్ హెడ్ లను తొలగించారు. ఎలన్ మస్క్ అభిప్రాయాల ప్రకారం సంస్థలో మార్పులు చోటుచేసుకుంటున్నారు.
ఇంతలో ఈ డీల్ ను హోల్డ్ లో పెడుతున్నట్టు మస్క్ ప్రకటించడం గందరగోళంగా మారింది.ఎలన్ మస్క్ వద్ద కొనుగోలుకు అన్ని డబ్బులు లేవా? లేక ట్విట్టర్ అంత ఖరీదు చేయదా? సంస్థతో డీల్ ను హోల్డ్ లో పెట్టడానికి అసలు కారణాలేంటన్న దానిపై ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్నారు. ఇంకొన్ని గంటల్లోనే ఈ డీల్ తాత్కాలిక హోల్డ్ వెనుక కారణాలు తెలిసే అవకాశం ఉంది.
Also Read: Sarkaru Vaari Paata OTT Steaming: ఓటీటీలోకి ‘సర్కారువారి పాట’.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn
— Elon Musk (@elonmusk) May 13, 2022
Recommended Videos