TS EAMCET Results 2023 Live : జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) హైదరాబాద్ TS EAMCET 2023 ఫలితాలను ప్రకటించింది. TS EAMCET 2023 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి , ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య), వి కరుణ , కమీషనర్ నవీన్ మిట్టల్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ , కార్యదర్శి ఎన్. శ్రీనివాసరావుతో సహా ఇతర ప్రముఖులు ప్రకటించారు. మార్క్‌ల లింక్‌లు eamcet.tsche.ac.inలో చూసుకోవాలని తెలిపారు.
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆమె ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను రిలీజ్ చేశారు. అభ్యర్థులు ఫలితాలను పొందడం కోసం వారి హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి.
TS EAMCET 2023 పరీక్ష మే 10 నుండి మే 14, 2023 వరకు నిర్వహించబడింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం TS EAMCET-2023కి సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ , రెస్పాన్స్ షీట్‌ను పరీక్ష ముగిసిన వెంటనే చివరి రోజు విడుదల చేసింది.
TS EAMCET 2023 ఆన్సర్ కీపై అభ్యంతరాలు లేవనెత్తడానికి మే 17 వరకూ గడువు ఇచ్చింది.
TS EAMCET-2023 ఫలితాలను ఈ అఫీషియల్ లింక్ లో తెలుసుకోండి..
https://eamcet.tsche.ac.in/