Nara Lokesh- Guntur Karam త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం…ఈ సినిమా ఇవాళ్ళ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయితే కొంతమంది మాత్రం సినిమా సూపర్ గా ఉంది అంటుంటే మరి కొందరు మాత్రం సినిమా అసలు బాలేదు అని వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మొదటి రోజు ఈ సినిమాని చూడడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ చాలా మంది ముందుకు కదిలారు.
మరి ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు ని చూడటం కోసం చాలా మంది అభిమానులు ఎదురు చూశారు.దాంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకునే వాళ్ళకి కొంత వరకు నిరాశ అయితే ఎదురైంది. మహేష్ బాబు అభిమానులకు మాత్రం ఈ సినిమా ఓకే అనిపించే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాకి చాలా హంగులు ఆర్భాటాలు అయితే చేస్తున్నారు. మరి ఈ సినిమాని త్రివిక్రమ్ భారీ రేంజ్ లో తీయలేదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ సినిమా మీద త్రివిక్రమ్ ఎందుకు నిర్లక్ష్యం వహించాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో రమ్యకృష్ణ పెద్ద కొడుకుగా మహేష్ బాబు కనిపిస్తే చిన్న కొడుకుగా రాహుల్ రవీంద్రన్ కనిపించాడు. అయితే రాహుల్ రవీంద్రన్ కి మొదట్లో ఒక సీన్ లో ప్రకాష్ రాజ్ తెలుగు నేర్పిస్తూ ఉంటాడు అందులో ‘చేయడం జరిగింది’ అని ఎక్కువగా నేర్పించాడు. దాంతో ఆయన కూడా చేయడం జరిగింది, చేయడం జరిగింది అంటూ పదేపదే అనడంతో ఇప్పుడు ఈ సినిమా చూసిన చాలామంది టిడిపి శ్రేణులు ఈ సీన్ నారా లోకేష్ ని ఉద్దేశించి రాసుకున్న సీన్ గా ఉందని మండిపడుతున్నారు. ఎందుకంటే నారాలోకేష్ కుసైతం తెలుగుటీచర్ ను పెట్టి ఇలానే తెలుగు నేర్పించారు.జరగడం జరిగింది అని లోకేష్ ఎక్కువగా అంటారు. ఈ సీన్ పట్ల వాళ్ళు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియా వేదికగా ఈ న్యూస్ అనేది భారీ రేంజ్ లో వైరల్ అవుతుంది. నిజానికి త్రివిక్రమ్ ఎందుకు ఇలాంటి సీన్ రాశాడు అని మరి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ వైసిపికి సపోర్టుగా ఇలా నారా లోకేష్ ని కించపరిచేలా సీన్ల ను ఎందుకు పెట్టారు అంటూ మరి కొంతమంది వాళ్ళు ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు…