Trivikram Sunil: త్రివిక్రమ్.. ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్ర దర్శకుడు.. సినిమాకు రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకూ తీసుకునే దిగ్గజ మాటల మాంత్రికుడు. కానీ ఒకప్పుడు ఇదే సినిమా ఇండస్ట్రీలో రూం రెంట్ కట్టడానికి డబ్బుల్లేక రూ.28 రూపాయిలు మాత్రమే చేతిలో ఉండి అష్టకష్టాలు పడ్డాడన్న సంగతి తెలుసా?.. నిజంగా ఇది నిజం.

మాటల మాంత్రికుడిగా.. విలక్షణ దర్శకత్వ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్న ఈ స్టార్ డైరెక్టర్ పంచులకు కేరాఫ్ అడ్రస్. త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగులకు విజిల్స్ వేయని వారుండరు. ఇక త్రివిక్రమ్ తోపాటు కెరీర్ స్ట్రాట్ కాకముందే అతడితో రూమ్ లో ఉన్న ప్రస్తుత కమెడియన్ సునీల్ కూడా ఎంతో కష్టపడి ఈస్తాయికి ఎదిగారు. వీరిద్దరి కష్టాల కడలి వింటే నిజంగానే కన్నీళ్లు వేయకమానవు.
సునీల్ సైతం కమెడియన్ గా స్ట్రాట్ చేసి హీరోగా ఎదిగి.. ఇప్పుడు మళ్లీ విలన్ గానూ ఇరగదీస్తున్నారు. పుష్ప2 మూవీలో విలన్ గా సునీల్ అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ఇక త్రివిక్రమ్ సైతం ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీకే పెద్ద హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా త్రివిక్రమ్ తానూ, సునీల్ ఒక రూంలో ఉండగా జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆ రోజుల్లో నేను సునీల్ లక్డీకపూల్ లో ఒక రూమ్ లో కలిసి అద్దెకు ఉండేవాళ్లమని.. రూంకు అద్దె చెల్లించడానికి డబ్బు కట్టకపోవడంతో రూమ్ ఖాళీ చేయమని ఓనర్ చెప్పారని.. అప్పుడు నా జేబులో కేవలం రూ.28 మాత్రమ ఉన్నాయని’ త్రివిక్రమ్ నాటి కష్టాలు గుర్తు చేసుకున్నాడు. రూ.30 ఉంటే రెండు సిగరెట్లు కాలిస్తే రూ.28కి పడిపోయాయని.. వాటితో రేపటికి టిఫిన్, డిన్నర్ చేద్దామని సునీల్ అన్నా కూడా వినకుండా కొత్తగా వచ్చిన కూల్ డ్రింక్ ను త్రివిక్రమ్ కొనేశాడట.. అది చూసి సునీల్ షాక్ అయ్యాడట..
జేబులో రూపాయి లేకుండా ఇప్పుడు కూల్ డ్రింక్ ఎందుకు కొన్నావని భయపడ్డాడట.. దానికి త్రివిక్రమ్ తాపీగా.. ‘డబ్బు లేదని రేపటి నుంచి ఆలోచించడం దేనికి.. ఇప్పటి నుంచి ఆలోచిద్దాం రా’ అని భరోసానిచ్చాడు. మనిషి భయపడుతున్నప్పుడు దారులు ఉన్నా కనిపించవని.. విషమ పరిస్థితుల్లో కాస్త కంగారుపడడంలో తప్పులేదు కానీ.. భయపడకూడదని అన్నారు. ఇలా భయపడడం కన్నా ధైర్యంగా ముందుడుగు వేస్తే దేనినైనా అధిగమించవచ్చని చెప్పుకొచ్చారు.
రూ.28 కూడా లేని త్రివిక్రమ్ ఇప్పుడు టాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న అగ్ర దర్శకుడిగా ఎదగడం ఆయన సత్తాకు నిదర్శనమని చెప్పొచ్చు.