Top Tourist Places : ప్రపంచం టూరిజం మ్యాప్ లో ఇన్నాళ్లు భారత్ చాలా వెనుకబడింది. భారత్ కంటే చిన్న చిన్న మాల్దీవ్స్ లాంటి దేశాలు చాలా ముందున్నాయి. వారి ఆర్థిక వ్యవస్థ అంతా టూరిజంపైనే ఆధారపడి ఉన్నాయి. టూరిజం వల్ల హోటల్స్ పెరుగుతాయి. ఫుడ్, రెస్టారెంట్లు పెరుగుతాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయి. ట్రాన్స్ పోర్ట్, షిప్పింగ్, విమానయానం ఇలా అన్నీ ముడిపడి ఉన్నాయి.
దురదృష్టవశాత్తు ఇన్నేళ్ల భారతంలో మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. అందుకే టూరిజంకు మనం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఊరికే ప్రచారం చేసుకుంటే జనాలు రారు. నీట్ గా, హైజనిక్ గా ఉన్న ప్రాంతాలకే టూరిస్టులు వస్తారు. మౌళిక వసతులు, పరిశుభ్రత పెరిగినప్పుడే జనం వస్తారు.
నిజానికి భారత్ లో ఉన్న టూరిజం అవకాశాలు ఏ దేశానికి లేవు. మన దేశంలో ఉన్న చారిత్రక ప్రదేశాలు ఏ దేశానికి ఇన్ని లేవు. మనం గనుక టూరిజం డెవలప్ చేస్తే తిరుగు ఉండదు. యూరప్, అమెరికాల్లో అసలు ఏం లేవు మనతో పోలిస్తే.. మంచు ప్రాంతాలు, ఎడారులు, అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు, కొండలు, గుట్టలు, చారిత్రక కట్టాలు ఇలా భారత్ లో లేని ప్రకృతి వనరులు లేవు. ఆధ్యాత్మిక టూరిజంలో మనకు పోటీ లేదు. అయినా టూరిజంలో మనం వెనుకబడి ఉన్నాం. దాన్ని వెలికి తీయడంలో విఫలమవుతున్నాం..
టూరిజం అభివృద్ధితో ప్రపంచ టూరిజం మ్యాప్ లో భారత్ కు స్థానం కల్పించాల్సిన ఆవశ్యకతపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.