Buchi Babu Sana : సుకుమార్(Sukumar) వద్ద శిష్యరికం చేసి, ఉప్పెన చిత్రం తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తొలి సినిమాతోనే ప్రభంజనం సృష్టించిన డైరెక్టర్ బుచ్చి బాబు(Buchi Babu Sana). త్వరలోనే ఇతను పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా చేరిపోతాడు. అంతటి సత్తా ఉన్న డైరెక్టర్. అయితే రీసెంట్ గానే ఇతను ‘సఃకుటుంబానాం’ అనే చిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఉదయ్, బుచ్చిబాబు కి అత్యంత ఆప్త మిత్రుడైన విక్రమ్ కి స్నేహితుడట. అందుకే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలవగానే వచ్చేసాడు బుచ్చి బాబు. డైరెక్టర్ సుకుమార్ వద్ద తనతో విక్రమ్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడని, అతనితో కలిసున్న రోజుల్లో నాకు ఒక పాయింట్ చెప్పాడు. దాని మీద ఒక పెద్ద హీరో తో సినిమా చేయాలనీ ఉందంటూ బుచ్చి బాబు చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను , విక్రమ్, శ్రీను మంచు స్నేహితులం. మేము ముగ్గురం కలిసి రంగస్థలం, నాన్నకు ప్రేమతో చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేశాము. విక్రమ్ కి అత్యంత ఆప్త మిత్రుడు ఉదయ్. విక్రమ్ ఇచ్చిన ఐడియా తోనే ‘సఃకుటుంబానాం’ చిత్రం చేసాడు ఉదయ్. ఈ స్టోరీ వినగానే నేను బాగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసాను. కొన్నేళ్ల క్రితం నేను, మా గురువు గారు సుకుమార్, విక్రమ్ కలిసి బ్యాంకాక్ కి వెళ్తున్నప్పుడు విక్రమ్ నాకు ఒక ఐడియా చెప్పాడు. దాని మీద నేను కథ రాసాను. త్వరలోనే ఒక స్టార్ హీరో తో ఈ సినిమా చేస్తాను’ అంటూ చెప్పుకాజొచ్చాడు.
ఇక బుచ్చి బాబు విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ‘పెద్ది’ అనే చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తో పాటు, కొంతమంది ఫైటర్స్ కూడా పాల్గొంటున్నారు. సినిమాకి హైలైట్ గా నిలవబోతున్న ఈ పోరాట సన్నివేశానికి బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్ దర్శకత్వం చేయబోతున్నాడు. జనవరి నెలాఖరు లోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, ప్రకటించిన తేదీ ప్రకారం మార్చ్ 27 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయ్. రీసెంట్ గా విడుదలైన ‘చికిరి..చికిరి’ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. రాబోయే రోజుల్లో రాబోయే కంటెంట్ ఎలా ఉండబోతుందో చూడాలి.