Star Hero Missed Opportunity: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోలందరు విజయాలను అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్టార్ హీరోలందరు వాళ్లకు ఉన్న ఇమేజ్ ను పెంచుకుంటూ వాళ్ళ మార్కెట్ ను విస్తరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఒక స్టార్ హీరో తెలంగాణ పవర్ స్టార్ గా అవతరిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏమి బాలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టు ప్లాప్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే విజయ్ దేవరకొండ… ఆయన చేసిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక అప్పటినుంచి ఆయనకు పెద్దగా సరైన సక్సెసు లైతే పడడం లేదు. ఈ సినిమా అతని ఇమేజ్ ను పెంచుతోంది అనుకుంటే ఈ సినిమా మాత్రం చాలా దారుణంగా డీలా పడి పడిపోయింది.ఈ మూవీ కలెక్షన్స్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు.ఈ సినిమా ఆయనకి భారీ ఇమేజ్ ను తెచ్చిపెడుతుంది అనుకుంటే ఆయన మార్కెట్ ని మరింత పడిపోయేలా చేసింది. మరి ఇలాంటి సందర్భంలోనే విజయ్ దేవరకొండ ఇకమీదట రాబోయే సినిమాలతో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటాడా?
Also Read: రజినీకాంత్ vs నాగార్జున… కూలీ మూవీ లో ఎవరి డామినేషన్ ఉండబోతుంది..?
ఎందుకని ఆయన నాసిరకం కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. ఆయన చేసే సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోయిందా? గౌతమ్ తిన్ననూరి లాంటి దర్శకుడితో ఆయన చేసిన కింగ్డమ్ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేరకు మెప్పించకపోగా చాలావరకు డీలాపడేలా చేసింది.
మరి ఏది ఏమైనా కూడా ఇక మీదట ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టబోతున్నట్టుగా తెలుస్తున్నాయి… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది…
Also Read: మహేష్ బాబు చేసిన సినిమాల్లో ఆయనకు నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఇకమీదట కూడా ఆయన మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తే తెలంగాణ పవర్ స్టార్ గా అవతరించే అవకాశం అయితే ఉన్నాయి. కానీ అలా కాకుండా ఇలానే ముందుకెళ్తే మాత్రం ఆయన చాలా వరకు డీలా పడే పరిస్థితి అయితే రావచ్చు… చూడాలి మరి ఇక మీదట విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది…