Tollywood Mafia: టాలీవుడ్ లో హీరో నిఖిల్ కి పది కోట్లు మార్కెట్ ఉంది. పైగా ప్రేక్షకుల్లో టాలెంటెడ్ హీరో అని మంచి గుర్తింపు ఉంది. అసలు ఇలాంటి హీరోని కూడా తొక్కేస్తారు అని ఎవ్వరూ ఊహించరు. కానీ.. ప్రస్తుతం నిఖిల్ పై కొందరు సినీ పెద్దలు తమ ఆధిపత్యం చూపిస్తున్నారు. అందుకే.. నిఖిల్ తాజాగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘ఇండస్ట్రీలో కేవలం కష్టపడటమే కాదు.. అండ దండలు కూడా ఉండాలి అని నిఖిల్ బాధ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలదొక్కుకున్న హీరో పరిస్థితే ఇలా ఉంటే.. ఇక కొత్త వాళ్ళ పరిస్థితి ఏమిటి ?, నిజంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ విషయంలో ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన సినిమాలకు ఎలాంటి సపోర్ట్ ఉండదు.

అసలు, సపోర్ట్ మాట దేవుడెరుగు ?, చివరకు ఆ సినిమాకి థియేటర్స్ ను కూడా దొరకకుండా చేస్తే ఏం చేయాలి ?, జీవితాలు పణంగా పెట్టి తీసిన చిన్న సినిమా రిలీజ్ ను ఆపేయడం ఎంత దారుణం..?, అంటే.. బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకోవాలి అంటే.. కచ్చితంగా దోపిడీకి గురి కావాల్సిందేనా ?, నిజానికి కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇలాంటి హిట్ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది కార్తికేయ 2. ప్రేక్షకుల్లో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కూడా జనంలోకి బాగా వెళ్ళింది.
అందుకే, మొదట ఈ చిత్రాన్ని జూలై 22 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దిల్ రాజు తన ‘థాంక్యూ’ సినిమా కోసం ‘కార్తికేయ 2’ రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేయించాడు. నిఖిల్ టీమ్ ఇక చేసేది ఏమి లేక, జూలై 22 నుండి ఆగస్టు 12కి తమ సినిమా రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంది. అయితే, ఆగస్టు 12న మాచర్ల నియోజవర్గం ఉంది, అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఉంది. అందుకే.. నిఖిల్ సినిమాని ఆగస్టు 12న విడుదల చేస్తే థియేటర్స్ దొరకవు అని బెదిరించారు. అక్టోబర్‌లో రిలీజ్ చేసుకో అంటూ ఉచిత సలహా ఇచ్చారు.
ఇలాంటి దెబ్బలు చూసి చూసి విసిగిపోయిన నిఖిల్ చివరకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. జీవితంలో మొదటి సారి ఏడ్చాను అంటూ ప్రెస్ ముందు ఎమోషనల్ అయ్యాడు. ఒక ఏవరేజ్ హీరోకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు.. ఇక ఇండస్ట్రీలో కొత్తవాళ్లు వచ్చి ఎలా సినిమాలు చేస్తారు ?, సరే ఆ పెద్దలు చెప్పినట్టే నిఖిల్ తన సినిమాని అక్టోబర్‌కి పోస్ట్ ఫోన్ చేసుకున్నాడు అనుకుందాం. కానీ, అక్టోబర్ లో మరో సినీ పెద్ద సినిమా రిలీజ్ కి రెడీగా ఉంటుంది. ఆ పెద్ద మనిషి కూడా మిగిలిన పెద్దలు లాగే.. నీ సినిమా రిలీజ్ ను నవంబర్ కి పోస్ట్ ఫోన్ చేసుకో అని బెదిరిస్తాడు. ఇలా ఈ సైకిల్ కొనసాగుతూనే ఉంటుంది. అదే ఒకవేళ ఎదిరించి.. రిలీజ్ కి రెడీ అయితే.. ఆ సినిమాకు థియేటర్స్ దొరకవు.

అసలు దీనికి బాధ్యలు ఎవరు ?, తెలుగు సినిమా రంగం మొత్తం ఆ నలుగురు పెద్దల చేతిలో ఉందని గత కొన్నేళ్ళుగా వినిపిస్తూనే ఉంది. ఆ నలుగురు పెద్దలు ఊ.. అంటే తప్ప చిన్న సినిమాలు రిలీజ్‌కు కూడా నోచుకోలేని పరిస్థితి మన తెలుగు సినిమాలది. ఇదంతా ఇండస్ట్రీలో కనబడని పెద్ద మాఫియా లాంటిది. వాస్తవానికి ఏ ఇండస్ట్రీలో ఎవ్వరినీ ఎవరూ పూర్తిగా కంట్రోల్ చేయలేరు. కానీ, సినిమా ఇండస్ట్రీలో కంట్రోల్ చేస్తారు. ముఖ్యంగా చిన్న సినిమాలు రిలీజ్ విషయంలో వారు చెప్పిందే ఫైనల్.
అందుకే, ఆ నలుగురు చేతుల్లోనే మొత్తం సినిమా రంగం గ్రిప్ అంతా ఉంది. ఏదైతేనేం చిన్న సినిమాలకు గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరిని ఎవరూ ఏమి చేయలేరు. కాబట్టి.. చిన్న సినిమాలు ఆషామాషీగా వస్తే వర్కౌట్ అవ్వదు. కంటెంట్ బలంగా ఉంటూనే.. ఆ సినిమా ఇక్కడ బతుకుతుంది. కాబట్టి చిన్న సినిమాల మేకర్స్ పెద్ద ఆలోచనలతో ముందుకు వెళ్లడమే వారి చేతుల్లో ఉంది. ఆ దిశగా వారి అడుగులు పడాలని ఆశిద్దాం.
[…] Also Read: Tollywood Mafia: టాలీవుడ్ మాఫియా : ఎదిగిన హీరోనే… […]