Tollywood: సినిమా ఇండస్ట్రీని దెబ్బ తీయడమే జగన్ లక్ష్యమా ? అందుకే, థియేటర్లపై దండయాత్ర చేసేందుకు అధికారులను పంపిస్తున్నాడా ? ఎవరు ఎన్ని చెప్పినా సినిమా టికెట్ల అంశంలో జగన్ సీతయ్యలా మారిపోయాడు. ఎవరు ఎంత ఇబ్బంది పడినా తన నిర్ణయం మాత్రం మారదు అన్నట్టుగా జగన్ తీరు వివాదాస్పదమవుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ను దెబ్బ తీయడం కోసమే.. జగన్ ఇదంతా చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నా.. మొత్తం సినీ పరిశ్రమే ఇప్పుడు బాధ పడాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది.

అయినా.. ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం పై జగన్ మొండి వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. జగన్ దెబ్బతో కష్టకాలం అంటూ నలిగిపోతున్న టాలీవుడ్ కి ఇప్పుడు మరో అతి పెద్ద దెబ్బ తగలబోతోంది. అందరిలో ప్రస్తుతం ఒమిక్రాన్ భయం పట్టుకుంది. దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు అని చెప్పి నైట్ కర్‌ఫ్యూ విధించింది.
నైట్ కర్‌ఫ్యూ వల్ల రెండు షోలు లాస్ అయినట్టే. అలాగే థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన పెట్టింది. ఇది రానున్న సినిమాలకు భారీ నష్టం. పైగా జనవరి నుంచి ప్రతి వారం భారీ సినిమాలు రానున్నాయి. కాబట్టి, అన్నీ సినిమా ఇండస్ట్రీలకు రాబోతున్న నాలుగైదు నెలలు చాలా కీలకం. మరి కీలకమైన ఈ సమయంలో ఒమిక్రాన్ తన ప్రభావం చూపిస్తే.. అప్పుడు థియేటర్స్ ను మూసేస్తే.. భారీ సినిమాల పరిస్థితి ఏమిటి ?

అసలుకే వేగంగా వ్యాప్తి చెందటం ఒమిక్రాన్ వైరస్ లక్షణం అంటున్నారు. కరోనా మొదటి రెండు వేవ్ లకే సినిమా వ్యవస్థ పూర్తిగా నేలమట్టం అయిపోయే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ సమయంలో ఈ ఒమిక్రాన్ వైరస్ అటాక్ చేస్తే.. ఇక సినిమా ఇండస్ట్రీ కోలుకోలేదు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది అతి పెద్ద సమస్య అవుతుంది.
నిజానికి కరోనా దెబ్బకు తెలుగు సినిమా పరిశ్రమ చాలా నష్టపోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే పగ బట్టింది. దాంతో ఇటు జగన్ దెబ్బ.. అటు ఒమిక్రాన్ దెబ్బ కారణంగా మధ్యలో టాలీవుడ్ విలవిల్లాడుతోంది. దీనికి తోడు ఏపీలో జగన్ ప్రభుత్వం సినిమా పరిధిని, ముఖ్యంగా స్టార్ హీరోల రెమ్యునరేషన్లను తగ్గించేలా పరిస్థితి కల్పించాలని జగన్ భావిస్తున్నాడు.
మరి ఇప్పుడు ఉన్నట్టు ఉండి కోవిడ్ థర్డ్ వేవ్ ఉధృతి పెరిగితే.. అది కారణంగా చూపించి.. జగన్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తల పేరుతో నైట్ కర్‌ఫ్యూ విధించొచ్చు. నైట్ కర్‌ఫ్యూ విధిస్తే.. ఇక రెండు షోలు లేనట్టే. ఒకవేళ, జగన్ కోపం ఇంకా చల్లారాక పోతే.. థియేటర్లను మొత్తానికే క్లోజ్ చెయ్యొచ్చు. లేదా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అయినా పెట్టొచ్చు.
Also Read: జగన్ కు ఆ దమ్ముందా? జర్నలిస్ట్ సాయి సంచలన వ్యాఖ్యలు
ఎటొచ్చి రానున్న రోజుల్లో జగన్ కి – ఒమిక్రాన్ కి మధ్య తెలుగు చిత్ర పరిశ్రమ నలిగి నలిగి విలవిలాడిబోతుంది. ఎలాగూ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. జనం కూడా థియేటర్స్ కి రారు. అప్పుడు థియేటర్స్ ఈడు పోయిన చేనులా బీడు పోవాల్సిందే. ఆ పరిస్థితి గనుక వస్తే.. ఇక ఏపీలో సగం థియేటర్స్ శాశ్వతంగా మూతపడతాయి.
ఈ పరిణామ క్రమం అంతా నిర్మాతలకు, హీరోలకు కచ్చితంగా కన్నీళ్లు పెట్టించేవే. అయితే, సినిమా వాళ్ళ కన్నీళ్లకు జగన్ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో కరగదు. పైగా మీ కన్నీళ్లకు మేము బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అంటూ జగన్ మంత్రులు వివరణ కూడా ఇస్తారు. ప్చ్.. టాలీవుడ్ ఏ నాడో చేసుకున్న పాపం, ఈ నాడు ఈ స్థితికి కారణం అని సరిపెట్టుకోవడం తప్ప ఇప్పుడు ఏ హీరో ఏమి చేయలేడు.
Also Read: జగన్ చేతికి మరో అస్త్రం.. టాలీవుడ్ కు మరిన్ని ఇబ్బందులు?