Times Now Survey: టైమ్స్ నౌ సర్వే : ఏపీలో అధికారం ఎవరిదంటే?

ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ తిరుగులేని ఆధిక్యత తో మూడోసారి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చింది. మొత్తం 543 స్థానాలు గాను.. ఎన్డీఏకు 296 నుంచి 326 వరకు లోక్సభ స్థానాలు వస్తాయని సర్వే వివరించింది.

Written By: Dharma, Updated On : August 17, 2023 10:19 am

Times Now Survey

Follow us on

Times Now Survey: దేశవ్యాప్తంగా ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. వ్యూహాలు పన్నుతున్నాయి. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా.. విపక్ష కూటమి ఇండియా సవాల్ విసురుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం పొలిటికల్ హీట్ నెలకొంది. ఈ తరుణంలో ప్రజాభిప్రాయాన్ని సర్వేలు ఓడిసిపడుతున్నాయి. ఎన్నికల సమీపించే కొలది సర్వేలు, ఒపీనియన్ పోల్స్ హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత జాతీయ సంస్థ టైమ్స్ నౌ చేపట్టిన సర్వే నివేదికలు వెల్లడయ్యాయి. ఆసక్తికర ఫలితాలు వెల్లడించాయి.

ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ తిరుగులేని ఆధిక్యత తో మూడోసారి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చింది. మొత్తం 543 స్థానాలు గాను.. ఎన్డీఏకు 296 నుంచి 326 వరకు లోక్సభ స్థానాలు వస్తాయని సర్వే వివరించింది. ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పింది. బిజెపి సొంతంగా 288 నుంచి 314 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ కేవలం 62 నుంచి 80 స్థానాలకు పరిమితమవుతుందని తేల్చేసింది.

ఇక ఏపీ విషయానికి వస్తే.. అధికార వైసిపి విజయదుందుభి మోగిస్తుందని సర్వే తేల్చింది. ఆ పార్టీకి 24 నుంచి 25 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. దాదాపు ఇటీవల వెల్లడైన సర్వేల్లో ఇదే రకం ఫలితాలు రావడం విశేషం.2019 ఎన్నికల్లో వైసిపి 22 లోక్సభ స్థానాలను దక్కించుకుంది. 49.8% ఓట్లను సాధించింది. అయితే తాజా సర్వేలో ఓటింగ్ శాతం పెరగడం విశేషం. ఈసారి 51.3% ఓట్లతో దాదాపు మొత్తం స్థానాలను తన ఖాతాలోకి వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చి చెప్పింది.

కొద్దిరోజుల కిందట ఓ జాతీయ మీడియా ఒపీనియన్ పోల్స్ సర్వేలో వైసిపి 18 నుంచి 21 స్థానాలను గెలుచుకుంటుందని తేలింది. రెండు వారాలు దాటక ముందే ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో వైసీపీ స్వీప్ చేస్తుందని తేలడం విశేషం. జూన్ 15 నుంచి ఆగస్టు 12 మధ్య ఈ సర్వే చేపట్టినట్లు సదరు సంస్థ వెల్లడించింది. అయితే ఈ సర్వేలను విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. అధికార వైసిపి జాతీయ మీడియా సంస్థలను మేనేజ్ చేస్తోందని ఆరోపిస్తున్నాయి. తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీకి.. ఆ స్థాయిలో ఫలితాలు సాధ్యమా? అని ప్రశ్నిస్తున్నాయి.