
మనలో ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి 365 రోజులు, లీపు సంవత్సరానికి 366 రోజులు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఒక గ్రామంలో ఎంతమంది జనాభా ఉన్నా ఆ గ్రామంలో దాదాపు 80 శాతం మంది 365 రోజుల్లో ఒక్కరోజే జన్మించడం సాధ్యం కాదు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ ప్రాంతానికి సమీపంలో ఉన్నా బారా గ్రామంలో మాత్రం దాదాపు 80 శాతం మంది జనవరి 1వ తేదీనే పుట్టారు.
Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు షాక్.. కేంద్రం కొత్త ఈకామర్స్ వెబ్ సైట్…!
వినడానికి ఆశ్చర్యంగా విచిత్రంగా ఉన్నా గ్రామంలో 80 శాతం మంది ఒకేరోజు పుట్టడానికి ఆధార్ కార్డు నమోదు చేసుకునే సిబ్బంది చేసే పొరపాటే కారణమని తెలుస్తోంది. ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలోని అమ్మ, నాన్న, పిల్లలు అందరి ఆధార్ కార్డుల్లో వాళ్లు జనవరి నెల 1వ తేదీనే పుట్టినట్లు నమోదై ఉంది. సంవత్సరాల్లో మార్పులు ఉన్నా తేదీల్లో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడం గమనార్హం.
Also Read: దేవుడా.. ఈ ఫ్యామిలీల్లో ఎవరికీ వేలిముద్రలే లేవంట..!
కేంద్ర ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాల క్రితం ఆధార్ కార్డులను ప్రవేశపెట్టింది. 2012 సంవత్సరంలో అధికారులు బరా గ్రామంలో ఆధార్ కార్డుల వివరాలను నమోదు చేసుకోవడానికి వచ్చారు. చాలామంది పుట్టినతేదీ వివరాలను సరిగ్గా చెప్పకపోవడంతో అధికారులు తెలియని వారి వివరాలను జనవరి 1వ తేదీగా వాళ్ల వయస్సును బట్టి సంవత్సరాన్ని రికార్డులలో పొందుపరిచారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
అధికారులు అలా నమోదు చేయడం వల్ల బరా గ్రామంలో 80 శాతం మంది జనవరి 1వ తేదీనే పుట్టినట్టు నమోదైంది. బరా గ్రామం మాత్రమే కాదు దేశంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే అధికారులు ఆ వివరాలను కరెక్ట్ చేయడానికి మళ్లీ ఎటువంటి ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది.