Rakhi Festival 2023: అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు బంధానికి ప్రతీక రక్షాబంధన్. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పౌర్ణమి తిధినాడు రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది బుధ, గురువారాల్లో పౌర్ణమి తిధి వచ్చింది. కాబట్టి రెండు రోజులపాటు రక్షాబంధన్ వేడుకలు కొనసాగాయి.
ప్రస్తుతం మార్కెట్లో, ఆన్లైన్లో కలర్ ఫుల్ రాఖీలు, రకరకాల డిజైన్లతో ఎన్నో ఫ్యాన్సీ రాఖీలు మనల్ని ఆకట్టుకుంటాయి. అయితే అన్ని శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం ముందుగా దూదితో తయారుచేసిన దారానికి పసుపు, కుంకుమ రాసి, వాటిపై అక్షింతలను కలిపి ఉంచాలి. ఆ తరువాతనే నీకు ఇష్టమైన డిజైన్లు లేదా కలర్ ఫుల్ రాఖీలను కట్టాలి.
రక్షాబంధన్ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఉతికిన బట్టలు ధరించాలి. ఇంటిని మొత్తం శుభ్రం చేయాలి. ముందుగా అక్షింతలు, కాటన్ క్లాత్, కుంకుమను కలిపి రాఖీ ఉండే ప్లేట్లో ఉంచాలి. ఆ తరువాత పూజ చేసే ప్లేట్లో దీపాన్ని వెలిగించి అందులో తీపి పదార్థాలను ఉంచాలి. అనంతరం ఓ చెక్కపీటపై శుభ్రమైన వస్త్రాన్ని ఉంచి అందులో మీ సోదరుడిని కూర్చోమని చెప్పాలి. సోదరుడిని తూర్పు దిశలో కూర్చునేలా చూసుకోవాలి. తన ముఖం మాత్రం పడమర దిశలో ఉంచాలి. అనంతరం సోదరుడి నుదుటిపై తిలకం దిద్దాలి. ఆ తరువాత మీ సోదరుని కుడి చేతికి దూదితో తయారుచేసిన రాఖీని కట్టాలి. రాఖీ కట్టే వేళ ” ఏం బద్ధో బలిరాజా, దానవేంద్రో మహాబలహ తేన్త్వం ప్రతి బద్దనామి రక్షే, మచల మచల:” అనే మంత్రాన్ని జపించాలి. చివరకు సోదరుడికి హారతినిచ్చి.. చిన్నవాడైతే ఆశీర్వదించాలి.. పెద్దవాడైతే దీవెనలు తీసుకోవాలి.