Delhi Liquor Scam: గొప్ప గొప్ప చదువులు చదివిన వారు గొప్ప గొప్ప స్థానాల్లో ఉండాలని కోరుకుంటారు. అంతేకానీ ఆయాచితంగా లభించే డబ్బు కోసం చిల్లర ప్రయత్నాలు చేయరు. అలా చేసిన వారు చట్టానికి ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారు. ఈ 76 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఎంతోమంది ఇలా పెద్దమనుషుల ముసుగులో అక్రమాలు చేసి తర్వాత అడ్డంగా దొరికిపోయారు.. ఇప్పుడు ఈ జాబితాలో సౌత్ గ్రూప్ అధిపతులు కూడా చేరారు. ఇక వీరు నడిపిన ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కుంభకోణం కోణాన్ని తెరపైకి తీసుకువచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్… ఈ కేసును మరింత లోతుగా తవ్వుతోంది. అయితే ఇప్పటివరకు ఎన్ని కోట్లు ఈ వ్యవహారంలో చేతులు మారాయి , ఎవరు ఇందులో ఉన్నారు? వారి పాత్ర ఏమిటి అనే విషయాలు మాత్రమే వెల్లడించిన ఈడీ.. ఇందులో దాగి ఉన్న అసలు చీకటి కోణాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తోంది.
తిరిగి రాబట్టుకునేందుకు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తామ చెల్లించిన లంచాలు తిరిగి రాబట్టుకునేందుకు సౌత్ గ్రూప్ సభ్యులు 2022 ఏప్రిల్ లో ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో భేటీ అయ్యారు. కవిత అరుణ్ రామచంద్రన్ తో కలిసి విజయ్ నాయర్ తో సమావేశమయ్యారు.. విజయ్ నాయర్ కు ముడుపులను అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్రన్ ఇచ్చారు. విజయ్ నాయర్ మార్లు లంచాలు స్వీకరించారు. దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చామనే వివరాలను బుచ్చిబాబు తన నోట్స్ లో రాసుకున్నాడు. బుచ్చిబాబు ఒక నెంబర్ 98490 39635 నుంచి మరో నెంబర్ 8696199999 కు వాట్సప్ సందేశం కూడా పంపారు. రెండు నెంబర్లు కూడా ఆయనవే. వాటిలో ఆరో పాయింట్ “వీ” కి “డబ్బులు కావాలి” అని ఉంది. అంటే ఇక్కడ “వీ” అంటే విజయ్ నాయర్ అని అర్థం. ఇక ఈ చాటింగ్ లో మిగిలిన పాయింట్లు కూడా ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించినవే.
కవితను కలిశారు
ఇండో స్పిరిట్ వ్యాపారానికి సంబంధించిన విషయంలో కవిత తో సమీర్ మహేంద్రు పలుమార్లు ఫోన్లో మాట్లాడారు.. హైదరాబాదులో ఆమెను తన నివాసంలో కలుసుకున్నారు. ఇక ఇండో స్పిరిట్స్ కంపెనీ లాభాల నుంచి అరుణ్ రామచంద్రన్ కు 32.86 కోట్లు అందాయి. ఇందులో 25.5 కోట్లను నేరుగా అరుణ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడం విశేషం. ఇక మధ్యవర్తుల ద్వారా 100 కోట్ల మీద ముడుపులను ప్రభుత్వాధికారులకు బదిలీ చేసేందుకు అరుణ్ రామచంద్రన్ వీరికి సహాయపడ్డాడు. అంతేకాదు 192 కోట్ల అక్రమార్జనలో కూడా అరుణ్ కీలక పాత్ర పోషించాడు.. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చాడు. కాదు తాను ఇచ్చిన వాంగ్మూలాలు వెనక్కి తీసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు.. ఆప్ నేతలకు చెల్లించిన ముడుపులకు గాను కవితకు ఇండోస్పిరిట్స్ కంపెనీలో భాగస్వామ్యం లభించింది. ఈ డీల్ కోసం కవిత ఈయకంగా 100 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది..
ఆంధ్రప్రభ పేపర్ కూడా
ఇక ఇండో స్పిరిట్స్ నుంచి కోటి, 70 లక్షలను వేరువేరుగా ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ కు, ఇండియా ఎహెడ్ సంస్థకు నేరుగా అరుణ్ బదిలీ చేశారు. ప్రకటనలు, ఈవెంట్ల కోసం ఈ డబ్బులు బదిలీ చేశారు . దీనికి సంబంధించిన ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇన్ వాయిస్ లు అధికారులకు లభ్యం కాలేదు.. ఇక్కడ ఇండో స్పిరిట్ సంస్థకు ఆంధ్రప్రభ ఎటువంటి ప్రకటనలు ప్రచురించలేదు..ఇండియా ఎ హెడ్ ఛానల్ ఎటువంటి ఈవెంట్స్ నిర్వహించలేదు. పైగా ఆ సంస్థలకు చెల్లించిన డబ్బులు తిరిగి రాలేదు. ఇక ఆంధ్రప్రభ ఎండి ముత్తా గౌతమ్ కు అరుణ్ 4.75 కోట్లు బదిలీ చేశారు.. అభిషేక్ బోయినపల్లికి 3.85 కోట్లు బదిలీ అయ్యాయి. అయితే గౌతమ్ వద్ద తాను అప్పుగా నగదు తీసుకున్నానని అరుణ్ రామచంద్రన్ వెల్లడించాడు. అని దీనికి సంబంధించి ఎటువంటి పేపర్లు లభించలేదు. రెండు రోజుల వ్యవధిలోనే ఈ లావాదేవీ పూర్తి కావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.. మొత్తం కుంభకోణంలో అభిషేక్ చేసిన సహాయానికి ప్రతిఫలంగా అరుణ్, గౌతమ్ ద్వారా ఇండోస్పిరెట్స్ నుంచి 3.8 కోట్లు రాజమార్గంలో అందాయి. ఇండియా ఎ హెడ్ ఛానల్ లో అభిషేక్ బోయినపల్లి పెట్టుబడుల్లో భాగంగా 1.7 కోట్లు బదిలీ అయినట్టు తెలుస్తోంది..మరోవైపు పంజాబ్, ఢిల్లీ ఎన్నికల కోసమే సౌత్ గ్రూప్ నుంచి ఆగమేఘాల మీద ఆప్ నేతలు లంచాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఆప్ నాయకులు అరుణ్ రామచంద్రన్, బోయినపల్లి, బుచ్చిబాబుతో ఆప్ తరఫున విజయ్ నాయర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ముగ్గురూ సౌత్ గ్రూపులో కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ రెడ్డికి ప్రాతినిధ్యం వహించారు.