New Ministers of Andhra Pradesh : ఏపీ మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ముంచుకొస్తోంది. మరో 24 గంటల వ్యవధే ఉంది. దీంతో అంతటా టెన్షన్ టెన్షన్ నెలకొంది. కొత్త మంత్రులు ఎవరు అన్న చర్చ లోతుగా సాగుతోంది. మరోవైపు నూతన మంత్రివర్గం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా కొత్త మంత్రి వర్గం కసరత్తు సీఎం జగన్ పూర్తి చేశారు.. కొత్త కేబినెట్ కూర్పునకు సుదీర్ఘ సమయం వెచ్చించారు. గవర్నర్ ఆమోదానికి ఇప్పటికే రాజీనామా లేఖలు పంపించారు. సీనియర్‌ల ఒత్తిడికి దిగివచ్చిన ముఖ్యమంత్రి 8 నుంచి 10 మంది పాత వారికి కేబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు సమాచారం.

సీనియర్‌ల పేర్లు జాబితాలో పెరగడంతో 4 నుంచి ఐదుగురి ఆశావహులకు మొండి చేయి తప్పదని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికి 25 మంది నూతన మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు పంపారు.
అనంతరం సీఎంవో నుంచి మంత్రులుగా ఎంపిక చేసిన ఆ 25 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు రానున్నాయి. చివరి నిముషంలో అయిన తమ అవకాశాలను నిలుపుకోవడానికి ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
కాగా ఏపీ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు చేశారు. సోమవారం ఉదయం 11:31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో అధికారులు తలమునకలై ఉన్నారు.
ఏపీ కేబినెట్ విస్తరణలో పలు వర్గాలకు నో చాన్స్ – కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలకు దక్కని చోటు – ప్రకాశం జిల్లాలో ఏ ఒక్కరికి దక్కని మంత్రి పదవి..
* ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ జాబితా
25 మందితో కొత్త మంత్రివర్గ కూర్పు
* కొత్త మంత్రుల జాబితా!
శ్రీకాకుళం:
1.ధర్మాన ప్రసాదరావు(బీసీ–పొలనాటి వెలమ) శ్రీకాకుళం
2.సీదిరి అప్పలరాజు(బీసీ–మత్స్యకార) పలాస, విజయనగరం:
3.బొత్స సత్యనారాయణ(బీసీ–తూర్పు కాపు)– చీపురుపల్లి మన్యం:
4.పీడిక రాజన్నదొర(ఎస్టీ)– సాలూరు
5.ధర్మాన ప్రసాదరావు, అనకాపల్లి:
6.గుడివాడ అమర్‌నాథ్(కాపు–ఓసీ)
7.బూడి ముత్యాలనాయుడు(బీసీ–కొప్పుల వెలమ) తూర్పుగోదావరి జిల్లా కాకినాడ
8.దాడిశెట్టి రాజా(కాపు–ఓసీ) తుని
కోనసీమ:
9.పినిపే విశ్వరూప్(ఎస్సీ–మాల)
10.చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(బీసీ– శెట్టిబలిజ)
పశ్చిమగోదావరి:
11.తానేటి వనిత(ఎస్సీ–మాదిగ)
12.కారుమూరు నాగేశ్వరరావు(బీసీ–యాదవ)
13.కొట్టు సత్యనారాయణ(కాపు–ఓసీ) తాడేపల్లిగూడెం
కృష్ణా:
14.జోగి రమేష్(బీసీ–గౌడ)
గుంటూరు జిల్లా:
15.అంబటి రాంబాబు(ఓసీ–కాపు)
16.మేరుగ నాగార్జున(ఎస్సీ–మాల)
17.విడుదల రజిని(బీసీ–రజక)
నెల్లూరు జిల్లా:
17.కాకాని గోవర్ధన్‌రెడ్డి(రెడ్డి–ఓసీ) రాయలసీమ:
కడప:
18.ఆంజాద్‌బాష(ముస్లిం _మైనార్టీ)
కర్నూల్:
19.బుగ్గన రాజేంద్రనాథ్(ఓసీ–రెడ్డి)
20.గుమ్మనూరు జయరాములు(బీసీ–బోయ)
చిత్తూరు:
21.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(ఓసీ–రెడ్డి)
22.కె.నారాయణస్వామి(ఎస్సీ–మాల)
23.ఆర్కే రోజా(ఓసీ–రెడ్డి)
అనంతపురం:
24.ఉషాశ్రీ చరణ్(బీసీ– కురుబ)
25.తిప్పేస్వామి(ఎస్సీ–మాదిగ)
బ్రాహ్మణ,కమ్మ,క్షత్రియ, వైశ్య కులాలకు మంత్రి వర్గంలో దక్కని చోటు!
[…] Also Read: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల జాబితా ఇద… […]
[…] Also Read: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల జాబితా ఇద… […]