
మారుతున్న కాలంతో పాటే ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. గతేడాదికి ఈ ఏడాదికి నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు, మొబైల్ టారిఫ్ ధరలు, పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు రోజురోజుకు పెరుగుతున్న ధరల వల్ల నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వీటి ధరలు తగ్గడం సాధ్యం కాదు కానీ ఒక యాప్ ను వినియోగిస్తే క్యాష్ బ్యాక్ పొంది వీటిని కొనుగోలు చేయవచ్చు.
మనం నిత్యం వినియోగించే పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్ అయిన fyool వినియోగదారులకు అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. బిల్లుల చెల్లింపుపై ఈ యాప్ ఏకంగా 50 శాతం డిస్కౌంట్ ను అందిస్తూ ఉండటం గమనార్హం. గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే ఈ యాప్ ను సులువుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే క్యాష్ బ్యాక్ విషయంలో మిగతా యాప్ లతో పోలిస్తే ఈ యాప్ కొంచెం భిన్నం.
ఇతర యాప్ లలో ఆ యాప్ ద్వారా షాపింగ్ చేస్తే సులువుగా క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అయితే fyool యాప్ లో మాత్రం డీటీహెచ్ రీఛార్జ్ లేదా మొబైల్ రీఛార్జ్ లేదా ఇతర బిల్లులను యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే క్యాష్ బ్యాక్ పొందే అవకాశం లభిస్తుంది. యాప్ ప్రస్తుతం 2,000 రూపాయల లోపు బిల్లులపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తోంది. ఇతర యాప్ లతో పోలిస్తే fooyl యాప్ ఎక్కువ డిస్కౌంట్ ఇస్తూ ఉండటం గమనార్హం.
fyool యాప్ క్యాష్ బ్యాక్ మనీతో వస్తువులను కొనుగోలు చేయడం లేదా fyool యాప్ వినియోగించే ఇతరులకు పంపించడం చేయవచ్చు. దేశంలోని ప్రముఖ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ fyool యాప్ వినియోగదారులకు భారీగా ప్రయోజనం చేకూరుస్తూ ఉండటం గమనార్హం.