కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

మనం నీరసం లేదా ఇతర వ్యాధులతో బాధ పడుతుంటే వైద్యులు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. మిగతా వాటితో పోల్చి చూస్తే కొబ్బరి నీళ్ల వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ కాలం ఆ కాలం అనే తేడాల్లేకుండా అన్ని కాలాల్లోనూ లభించే కొబ్బరి బోండాల ద్వారా వచ్చే కొబ్బరి నీళ్లు అనేక రోగాలను నయం చేయడంలో సహాయపడతాయి. కల్తీకి ఆస్కారం లేని కొబ్బరి నీళ్లు సర్వ రోగ నివారిణిగా పని చేస్తాయి. […]

Written By: Navya, Updated On : November 6, 2020 8:48 am
Follow us on


మనం నీరసం లేదా ఇతర వ్యాధులతో బాధ పడుతుంటే వైద్యులు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. మిగతా వాటితో పోల్చి చూస్తే కొబ్బరి నీళ్ల వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ కాలం ఆ కాలం అనే తేడాల్లేకుండా అన్ని కాలాల్లోనూ లభించే కొబ్బరి బోండాల ద్వారా వచ్చే కొబ్బరి నీళ్లు అనేక రోగాలను నయం చేయడంలో సహాయపడతాయి. కల్తీకి ఆస్కారం లేని కొబ్బరి నీళ్లు సర్వ రోగ నివారిణిగా పని చేస్తాయి.

చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా కొబ్బరి నీళ్లను తీసుకోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యల్లతో పోల్చి చూస్తే రక్తపోటు విషయంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పని చేస్తాయి. బీపీతో బాధ పడుతున్న వాళ్లు ప్రతిరోజూ కొబ్బరినీళ్లను తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. షుగర్ తో బాధ పడేవాళ్లు సైతం కొబ్బరి నీళ్లను తీసుకోవచ్చు. అయితే వీళ్లు లేత కొబ్బరితో పోలిస్తే ముదిరిన కొబ్బరి ఉన్న కొబ్బరి బోండాల్లోని నీళ్లను తాగితే మంచిది.

కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు కొవ్వు లేదా కొలెస్ట్రాల్ ఉండదు. ఖనిజాలు పుష్కలంగా ఉండే కొబ్బరి నీళ్లు ఎన్నో రకాల రుగ్మతలను దూరం చేస్తాయి. కొబ్బరి నీళ్లు గుండె సంబంధిత సమస్యలన్నింటినీ తక్కువ సమయంలోనే దూరం చేస్తాయి. జీవక్రియ రేట్ ను పెంచి బరువును తగ్గించడంలో సహాయపడతాయి. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధ పడేవాళ్లు కొబ్బరి నీళ్లు తాగితే ఆ సమస్య దూరమవుతుంది.

కొబ్బరి నీళ్లు డీ హైడ్రేషన్ సమస్యను సైతం దూరం చేస్తాయి. జీర్ణశక్తిని పెంచడం కొబ్బరి నీళ్లు ఎంతగానో సహాయపడతాయి. పొటాషియం లెవెల్స్ తక్కువగా ఉండే కొబ్బరి నీళ్లు కండరాల తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. ఎముకలను బలంగా ఉంచడంతో పాటు రక్తం గడ్డ కట్టకుండా చేస్తాయి.