https://oktelugu.com/

పోలవరం.. ఎంతవరకు వచ్చింది?

ఏపీ కలల ప్రాజెక్ట్ పోలవరం. దీన్ని పూర్తి ఏపీ సగం జనాభాకు సాగు, తాగునీటి సమస్యలు ఉండవు. సీమకు పారించి సస్యశ్యామలం చేసేంత వరద నీటి సామర్థ్యం దీని సొంతం. దశాబ్ధాలుగా ఈ ప్రాజెక్ట్ పూర్తికావాలన్నది ప్రజల చిరకాల వాంచ. దీన్ని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించగా.. ఇప్పుడు ఆయన కుమారుడు సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. మధ్యలో వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం దీన్నొక ఏటీఎంలా వాడేశాడన్న అపవాదును మూటగట్టుకున్నాడు. మరిన్ని ఆంధ్ర […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 08:20 AM IST
    Follow us on

    ఏపీ కలల ప్రాజెక్ట్ పోలవరం. దీన్ని పూర్తి ఏపీ సగం జనాభాకు సాగు, తాగునీటి సమస్యలు ఉండవు. సీమకు పారించి సస్యశ్యామలం చేసేంత వరద నీటి సామర్థ్యం దీని సొంతం. దశాబ్ధాలుగా ఈ ప్రాజెక్ట్ పూర్తికావాలన్నది ప్రజల చిరకాల వాంచ. దీన్ని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించగా.. ఇప్పుడు ఆయన కుమారుడు సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. మధ్యలో వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం దీన్నొక ఏటీఎంలా వాడేశాడన్న అపవాదును మూటగట్టుకున్నాడు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా ఏకంగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కి అసెంబ్లీలో చాలెంజ్ చేశాడు. పోలవరం పూర్తి చేస్తాం అని తొడగొట్టాడు. కానీ చేయలేకపోయాడు. అధికారంలోకి వచ్చాక జగన్ దాన్ని పూర్తి చేయడం విశేషం. మొన్నటి ఎన్నికల వేళ దేశ ప్రధాని మోడీ తనకు తానుగా టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం పోలవరంను ఏటీఎంలా వాడేసిందని ఆరోపించాడు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండేవి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక.. పోలవరం పనులు మేఘా చేపట్టాక వాయువేగంతో పనులు నడుస్తున్నాయి. కరోనా వచ్చినా.. వరదలు ముంచెత్తినా పనులు మాత్రం ఆగకుండా కమిట్ మెంట్ తో సాగుతున్నాయి. రాత్రి పూట కూడా పనులు జరుగుతుండడం విశేషంగా చెప్పవచ్చు. అత్యంత ఆధునిక, సాంకేతికపరిజ్ఞానంతో నడిచే యూనిక్యూ మెషీన్లను పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మేఘా సంస్థ వాడుతూ పూర్తి చేస్తోంది. డెడ్ లైన్ లోపల ప్రాజెక్ట్ పూర్తి చేయాలని పట్టుదలతో ముందుకెళుతోంది.

    పోలవరం పనులను చంద్రబాబు సర్కార నత్తకు నడకనేర్పేలా చేస్తే.. ఇప్పుడు జగన్ ప్రాజెక్ట్ చిరుత వేగంతో పూర్తి చేస్తోంది. ఈ ఇద్దరి పాలనకు పోలవరం పనుల పూర్తే మచ్చుతునక అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. నక్కకు నాగలోకానికి అంత తేడా ఉందని అంటున్నారు.

    Also Read: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివీ

    మేఘా ఇంజనీరింగ్ సంస్ద ఈ సంవత్సర కాలంలో స్పిల్ వేను శరవేగంతో పూర్తి చేస్తోంది. మేఘా చేపట్టక ముందు ఆనాడు పియర్స్ ఎత్తు సరాసరి 28 మీటర్లు ఉంటే.. ఇప్పుడు 52 మీటర్లు కు నిర్మాణం పూర్తి కావడం విశేషంగా చెప్పొచ్చు. ఇప్పటికే 171 గడ్డర్లు నిర్మాణం పూర్తి అయ్యింది. గడ్డర్లు నిర్మాణం పూర్తి అవ్వడమే కాకుండా దాదాపు 84 గడ్డర్లును స్పిల్ వే పియర్స్ పై పెట్టి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించింది.. 10పియర్స్ పై బ్రిడ్జి శ్లాబు నిర్మాణం దాదాపు 250మీటర్లు పూర్తి అయ్యింది. మిగతా పియర్స్ మీద గడ్డర్ల ఏర్పాటుతో పాటు,షట్టరింగ్ వర్క్, స్టీల్ అమరిక ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గేట్లు ఏర్పాటులో కీలకమైన ట్రూనియన్ భీంల నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 20 ట్రూనియన్ భీంల నిర్మాణం పూర్తయ్యింది. పూర్తి అయిన ట్రూనియన్ భీంల దగ్గర గేట్లు ఏర్పాటుకు సంబందించిన ప్రిలిమినరీ పనులు జరుగుతున్నాయి.

    స్పిల్ వే లో ఇప్పటి వరకు 1,94,944 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్పిల్ ఛానెల్ లో 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని,10,64,417 క్యూబిక్ మీటర్లు మట్టితవ్వకం పనులు ఇప్పటివరకు పూర్తయ్యాయి. జూన్ నుండి స్పిల్ ఛానెల్ లోకి వరద నీరు రావటంతో పనులు నిలిచిపోయాయి. వరద నీరు తోడటం ప్రారంభించి త్వరలోనే మట్టి తవ్వకం పనులు,కాంక్రీట్ పనులు ప్రారంభించనున్నారు. ఈ సీజన్ లో పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించారు.

    గ్యాప్-1 ఢయా ఫ్రంవాల్ నిర్మాణ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. 2కాలమ్స్ నిర్మాణ పనులు కూడా పూర్తి అయ్యాయి. గ్యాప్-3లో మట్టి తవ్వకం పనులు,కొండ రాయి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. కీలకమైన 902కొండ తవ్వకం పనులను 1,88,623 క్యూబిక్ మీటర్లు పూర్తి అయ్యాయి. వరదల వల్ల పాడైపోయిన ఎగువ కాఫర్ ఢ్యాం నిర్మాణ పనులును సైతం వేగం చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.

    Also Read: ఏపీ మరో బృహత్ కార్యానికి జగన్ శ్రీకారం

    ఇలా ఇంతటి కరోనా కరువు కాలంలో.. గోదావరి ఉగ్రరూపంతో పొంగుతున్న సమయంలోనూ ఏపీ ప్రభుత్వం, మేఘా సంస్థ పోలవరంను పరుగులు పెట్టిస్తుండడం విశేషంగా మారింది. గడువులోపు పూర్తి చేసి తరతరాల నిర్లక్ష్యానికి చెక్ పెట్టాలని యోచిస్తున్నాయి. జగన్ పట్టుదల.. మేఘా పనితనంతో ఏపీ ప్రజల చిరకాల వాంచ, కలల ప్రాజెక్ట్ పూర్తి అవుతోంది. నవ్విన నాపచేనే పండు అన్నట్టుగా టీడీపీ ఏ నోటితోనైతే విమర్శలు గుప్పించారో ఇప్పుడు అదే నోటితో పొగడాల్సిన రోజు రాబోతోంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి రెడీ అవుతోంది.