ODI World Cup : వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్పు గెలిచిన ఆ రెండు టీములు ఇవే…

ఇక అలాగే 2007 వ సంవత్సరం లో కూడా ఆస్ట్రేలియా టీమ్ వరుసగా రెండో సారి వరల్డ్ కప్ అందుకుంది...ఇక అప్పుడు కూడా వరుసగా అన్ని మ్యాచ్ ల్లో గెలిచి వరల్డ్ కప్ ని అందుకుంది...

Written By: NARESH, Updated On : November 13, 2023 9:57 am
Follow us on

ODI World Cup : ప్రతి దేశపు క్రికెట్ టీమ్ కి కూడా వరల్డ్ కప్ సాధించడం అనేది ఒక కల. ప్రతి టీం కూడా తమ దేశం తరఫున కనీసం ఒక్కసారైనా వరల్డ్ కప్ ను సాధించాలి అనే ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలో వరల్డ్ కప్ అనేది దక్కాలి అంటే అహర్నిశలు కష్టపడుతూ, ప్రతి మ్యాచ్ ని క్యాలిక్లేట్ చేస్తూ గెలుస్తామనే ధీమాని వ్యక్తం చేస్తూ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తూ మన ప్లేయర్లని మోటివేట్ చేస్తూ అందరితో బాగా ఆడించుకునే శక్తి కెప్టెన్ కి ఉన్నప్పుడే ఒక టీం అనేది వరల్డ్ కప్ ని సాధిస్తుంది.

ఇక ఇలాంటి క్రమంలో 2023 వరల్డ్ కప్ ఆడుతున్న ఇండియన్ టీం ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా వరుసగా తొమ్మిది మ్యాచ్ ల్లో విజయాలను సాధించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీం అద్భుతమైన విజయాన్ని సాధించడానికి టీమ్ ప్లేయర్ కూడా తనదైన ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నారు ఇక అందులో భాగంగానే లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లో 9 మ్యాచులు గెలిచి ఇండియన్ టీం ఈ టోర్నీలో అన్ని జట్ల కంటే బలమైన జట్టుగా తనని తను ప్రూవ్ చేసుకుంటుంది. ఇక ఈనెల 15వ తేదీన న్యూజిలాండ్ తో ఇండియా సెమి ఫైనల్ మ్యాచ్ ఆడటానికి రెఢీ అయింది…

అయితే ఇప్పటివరకు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్ని మ్యాచ్ లు గెలుచుకుంటూ వచ్చి ఫైనల్ లో విజయం సాధించి వరల్డ్ కప్ ట్రోఫీని అందుకున్న టీములు ఏవేవో అవి ఎన్నిసార్లు అందుకున్నాయి అనే విషయాలను కూడా మనం ఒకసారి తెలుసుకుందాం…

1975 వ సంవత్సరంలో వెస్టిండీస్ టీం కెప్టెన్ గా క్లైవ్ లాయిడ్ అద్భుతమైన కెప్టెన్సీని కనబరుస్తూ మొదటిసారి వరల్డ్ కప్ ని వెస్టిండీస్ కి అందించిన కెప్టెన్ గా చరిత్రలో నిలిచాడు. ఇక 1975 సంవత్సరంలోనే వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయింది. అదే సంవత్సరం వెస్టిండీస్ టీమ్ అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చి 1975లో వరల్డ్ కప్ టైటిల్ ని దక్కించుకుంది… ఇక టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్ లను వెస్టిండీస్ టీమ్ గెలిచింది…ఇక అప్పుడు అత్యంత స్ట్రాంగ్ టీమ్ లు గా ఉన్న శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా వంటి టీమ్ లను వరుసగా ఓడిస్తు వరల్డ్ కప్ అందుకుంది…

ఇక అదే వెస్టిండీస్ టీమ్ 1979 లో కూడా తనదైన రీతిలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి వరుసగా టోర్నీ లో ఒక్క మ్యాచ్ కూడా ఒడిపోకుండా ట్రోఫీ ని గెలుచుకుంది… అయితే శ్రీలంక తో జరిగిన మ్యాచ్ వర్షం కారణం గా ఒక్క బాల్ కూడా వేయకుండానే రద్దు అవ్వడం జరిగింది. ఇక 1979 లో కూడా వెస్టిండీస్ టీమ్ వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది…

ఇక 2003 వ సంవత్సరం లో వెస్టిండీస్ తర్వాత వరల్డ్ కప్ టోర్నీ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ గెలిచిన టీమ్ గా ఆస్ట్రేలియా టీమ్ ఒక రికార్డ్ ని క్రియేట్ చేసింది…ఇక సౌతాఫ్రికా వేదిక గా జరిగిన ఈ టోర్నీ ఆస్ట్రేలియా వరుసగా 11 మ్యాచ్ ల్లో గెలిచింది..ఇక ఫైనల్ లో ఇండియా మీద గెలిచి వరల్డ్ కప్ ని సొంతం చేసుకుంది…

ఇక అలాగే 2007 వ సంవత్సరం లో కూడా ఆస్ట్రేలియా టీమ్ వరుసగా రెండో సారి వరల్డ్ కప్ అందుకుంది…ఇక అప్పుడు కూడా వరుసగా అన్ని మ్యాచ్ ల్లో గెలిచి వరల్డ్ కప్ ని అందుకుంది…

ఇలా రెండు టీమ్ లు ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో చేరో రెండు సార్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ ట్రోఫీ ని అందుకున్నారు…ఇక ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ఒక్క మ్యాచ్ కూడా ఒడిపోకుండా వరల్డ్ కప్ గెలిచిన మూడోవ టీమ్ గా ఇండియన్ టీమ్ చరిత్రలో నిలుస్తుంది…అలాగే మొత్తం వరల్డ్ కప్ హిస్టరీ లో ఇది ఐదొవ సారి అవుతుంది…

చూడాలి మరి ఇదే జోరు ని ఇండియా సెమీ ఫైనల్, ఫైనల్ లో కొనసాగించి మ్యాచ్ లు గెలిచి కప్పు అందుకుంటారో, లేదో…