Highest Grossing Movies : టాలీవుడ్ కి ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ప్రారంభం లోనే ‘వాల్తేరు వీరయ్య’ , ‘వీర సింహా రెడ్డి’ వంటి సూపర్ హిట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ కి మోత మోగిపోయింది..ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి 135 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.. ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి కోటి రూపాయిల లాభం మాత్రం వచ్చింది..ఈ సందర్భంగా ఇప్పటి వరకు టాలీవుడ్ లో అత్యధిక లాభాలను దక్కించుకున్న సినిమాలు ఏమిటో..అందులో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఏ స్థానం లో ఉందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

1) బాహుబలి 2 :
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ వెండితెర అద్భుతం , ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సునామి ని అంత తేలికగా మర్చిపోగలమా..ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ 352 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా..508 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి..ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఒక ఆల్ టైం రికార్డు..భవిష్యత్తులో కూడా దీనిని ఎవ్వరూ ముట్టుకోలేరు.
2) బాహుబలి :
టాలీవుడ్ నుండి మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న చిత్రం ఇది..ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 118 కోట్ల రూపాయిలకు అమ్ముడుపోయిన ఈ చిత్రం 186 కోట్ల రూపాయిల లాభాల్ని అర్జించింది.
3) అలా వైకుంఠపురం లో:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ క్రేజీ చిత్రానికి విడుదలకు ముందు భారీ హైప్ ఉండేది..అందుకే ఈ సినిమాకి దాదాపుగా 84 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది..ఫుల్ రన్ మొత్తం పూర్తి అయ్యాక 75 కోట్ల రూపాయిల వరకు లాభాలు వచ్చాయి..ఒక ప్రాంతీయ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు అంటే మామూలు విషయం కాదు.
4) గీత గోవిందం :
అర్జున్ రెడ్డి వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ హీరో గా నటించిన చిత్రం ఇది..ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించగా, పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించాడు..కేవలం 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి 55 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి..ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు రావడం ఇదే తొలిసారి.
5) F2 :
విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ కే 34 కోట్ల రూపాయిల బిజినెస్ జరగగా , ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి..ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కి ఈ సినిమానే అన్నిటికంటే మోస్ట్ ప్రాఫిట్స్ తెచ్చిన సినిమా అట..ఈ విషయాన్నీ ఆయనే పలు ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చాడు.
6) రంగస్థలం :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మైలు రాయిగా, నటుడిగా ఆయనని మరో స్థాయికి తీసుకెళ్లిన ఈ చిత్రం , బాక్స్ ఆఫీస్ పరంగా కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..80 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి 47 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి.
7) వాల్తేరు వీరయ్య :
రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్ల రూపాయలకు జరగగా, ఇప్పటి వరకు 46 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి..సినిమా రన్ ఇంకా ఉండడం తో 50 కోట్ల మార్కు కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.
8) కార్తికేయ 2 :
గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమా గా విడుదలై ఇండియా వైడ్ ఒక ఊపు ఊపేసిన ఈ కార్తికేయ 2 చిత్రానికి కేవలం 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది..కానీ వచ్చిన లాభాలు మాత్రం అక్షరాలా 45 కోట్ల రూపాయిలు..నిఖిల్ మళ్ళీ ఈ సినిమా వసూళ్లను ఎప్పుడు అందుకుంటాడో కూడా చెప్పలేని పరిస్థితి..ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఈ చిత్రం.
9) పుష్ప :
రంగస్థలం వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్, మరియు అలా వైకుంఠపురం లో వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరు కలిసి చేసిన సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు ట్రేడ్ లో మామూలు రేంజ్ లో లేవు..దాంతో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 144 కోట్ల రూపాయలకు జరిగింది..పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం 39 కోట్ల రూపాయిలు లాభాలు వచ్చినట్టు సమాచారం.
10 ) సరిలేరు నీకెవ్వరూ :
మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ 2020 సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది..సుమారుగా 100 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి 39 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి.