Anil Ravipudi -Balayya : కొత్త కాంబినేషన్: బాలయ్యతో తోటకూర బిర్యానీ… అనిల్ రావిపూడికి అదే పెద్ద ఛాలెంజ్?

Anil Ravipudi -Balayya : డిఫరెంట్ జోనర్స్ లో సక్సెస్ అయిన హీరో, డైరెక్టర్ కలిసి మూవీ చేస్తే ఆ కాంబో మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే అపోహలు, భయాలు కూడా ఏర్పడతాయి. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య చిత్రం అంటే ఫాన్స్ పక్కా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అవుతారు. అది హిట్ కాంబినేషన్. వరుసగా బాలయ్యకు ఆయన మూడు హిట్స్ ఇచ్చారు. బాలయ్యను సిల్వర్ స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేయాలో బోయపాటికి […]

Written By: NARESH, Updated On : January 31, 2023 8:20 pm
Follow us on

Anil Ravipudi -Balayya : డిఫరెంట్ జోనర్స్ లో సక్సెస్ అయిన హీరో, డైరెక్టర్ కలిసి మూవీ చేస్తే ఆ కాంబో మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే అపోహలు, భయాలు కూడా ఏర్పడతాయి. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య చిత్రం అంటే ఫాన్స్ పక్కా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అవుతారు. అది హిట్ కాంబినేషన్. వరుసగా బాలయ్యకు ఆయన మూడు హిట్స్ ఇచ్చారు. బాలయ్యను సిల్వర్ స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేయాలో బోయపాటికి తెలిసినంతగా మరో దర్శకుడికి తెలియదు. వీరసింహారెడ్డి చిత్రంతో గోపీచంద్ మలినేని కూడా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు.

వీరసింహారెడ్డి సంక్రాంతి ప్రభంజనంలో గట్టెక్కింది. లేదంటే అది ప్లాప్ ఖాతాలో చేరిపోయేది. కారణం ఏదైనా వీర సింహారెడ్డి హిట్ మూవీగా బాలయ్య ఖాతాలో చేరింది. ఇది చాలా అరుదైన విషయం. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి దశాబ్దాలు దాటిపోయింది. బాలయ్య సక్సెస్ ట్రాక్ మైంటైన్ చేశారు. ఆ జోష్ లో కొత్త మూవీ పూర్తి చేస్తున్నారు. బాలయ్య-అనిల్ రావిపూడి మూవీ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. బాలయ్య 108వ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది.

నిజానికి బాలయ్య-అనిల్ రావిపూడిలది ఒకింత అసహజమైన కాంబినేషన్. బాలయ్య ఊరమాస్ హీరో. పవర్ ఫుల్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులే ప్రధాన బలం. ఆయనకు విజయాలు అందించిన సినిమాలన్నీ దాదాపు ఒకే జోనర్, ఫార్మటులో తెరకెక్కాయి. సమరసింహారెడ్డి నుండి వీరసింహారెడ్డి వరకు బాలయ్యది అదే తీరు. కాదని ప్రయోగాలు చేస్తే ఆడియన్స్ అంగీకరించలేదు. అందుకే మనసులో కొత్త సబ్జెక్ట్స్ చేయాలని ఉన్న బాలయ్య ప్రయోగాల జోలికి పోలేదు. కెరీర్ బిగినింగ్ లో మాత్రమే ఆయన భిన్నమైన సబ్జెక్ట్స్ తో హిట్స్ కొట్టారు.

ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే మాస్ కమర్షియల్ చిత్రాలు చేయడం ఆయనకు కూడా తెలుసు. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ వంటి బిగ్ స్టార్ ని ఆయన హ్యాండిల్ చేశారు. ఆయన ఇమేజ్ కి సరిపోయే కథతో కమర్షియల్ హిట్ ఇచ్చాడు. అయితే ఆయన ప్రధాన బలం కామెడీ ట్రాక్స్. యాక్షన్, హీరోయిజంకి సమానమైన కామెడీ రాసుకుంటారు. ఈ క్రమంలో బాలయ్య సినిమాలో కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ తో కామెడీ ట్రాక్స్ పెడతాడా? పెడితే అవి ఫలితం ఇస్తాయా? అనేది అసలు మేటర్. ఎందుకంటే తేడా కొడితే డిజాస్టర్ అవుతుంది. కాబట్టి అనిల్ రావిపూడికి ఈ మూవీ అతిపెద్ద ఛాలెంజ్.

ఈ మూవీ తెలంగాణ నేపథ్యంలో సాగుతుందని అనిల్ రావిపూడి ఆల్రెడీ హింట్ ఇచ్చాడు మరి బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే ఊరమాస్ ఎలివేషన్స్, తన మార్కు కామెడీ కలగలిపి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఇవ్వగలడా అనేది చూడాలి. ఇక బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలక రోల్ చేస్తున్నారు.