https://oktelugu.com/

Interesting secrets:  శరీరంపై వేసే పచ్చబొట్టు పర్మినెంట్.. నీటిలో రాయి వేస్తే మునుగుతుంది..? అంతపెద్ద షిప్ ఎందుకు మునగదు..?

Interesting secrets: మన చూట్టూ జరిగే కొన్ని సంఘటనలను చూస్తూ ఉంటాం. కాని అవి ఎలా ఏర్పడుతున్నాయి..? అలా జరగడానికి కారణం ఏంటి అని పెద్దగా ఆలోచించం. కానీ సైంటిఫిక్ గా కొందరు ఇలాంటి వాటికి కారణాలు కనుగొన్నారు. అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటో చూద్దాం.. Also Read: పాత నోట్లే కదా అని పడేయకండి.. అవే మిమ్మల్ని లక్షాధికారులు చేస్తాయి.. ఎలాగంటే? నీటిలో చిన్నరాయి వేస్తే మునుగుతుంది. కానీ టన్నుల కొద్ది బరువున్న షిప్ లు నీటిపై […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2021 10:29 am
    Follow us on

    Interesting secrets: మన చూట్టూ జరిగే కొన్ని సంఘటనలను చూస్తూ ఉంటాం. కాని అవి ఎలా ఏర్పడుతున్నాయి..? అలా జరగడానికి కారణం ఏంటి అని పెద్దగా ఆలోచించం. కానీ సైంటిఫిక్ గా కొందరు ఇలాంటి వాటికి కారణాలు కనుగొన్నారు. అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటో చూద్దాం..

    Also Read: పాత నోట్లే కదా అని పడేయకండి.. అవే మిమ్మల్ని లక్షాధికారులు చేస్తాయి.. ఎలాగంటే?

    నీటిలో చిన్నరాయి వేస్తే మునుగుతుంది. కానీ టన్నుల కొద్ది బరువున్న షిప్ లు నీటిపై తేలియాడుతూ ఉంటాయి. మనం ఒక బెలూన్ ను నీటిలో ముంచితే ఆ బెలూన్ బయటకు వస్తుంది. దీనిని బోయెన్సిక్ ఫోర్స్ అంటారు. ఏదైనా ఒక వస్తువు నీటిలో ముంచినప్పుడు ఆ బరువుకుసమానంగా నీరు పైకి వస్తుంది. మరో విషయం ఏమిటంటే సాంద్రత. ఏ వస్తువుకైతే సాంద్రత తక్కువగా ఉంటుందో ఆ వస్తువు నీటిపై తేలుతుంది. ప్లాస్టిక్, చెక్క, నూనెకు నీటి కన్నా తక్కువ సాంద్రత ఉంటుంది. అందుకే అవి నీటిపై తేలియాడుతుంటాయి. ఇనుముకు సాంధ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే షిప్ ఇనుమే కదా అనుకోవచ్చు. కానీ షిప్ తయారు చేసేటప్పుుడు అడుగు బాగానా సాంధ్రత తక్కువగా ఉండే వస్తువును ఉంచుతారు. అందువల్ల షిప్ నీటిపై తేలియాడుతూ ఉంటుంది.

    శరీరంపై టాటూస్ వేయించుకోవడం ఇప్పట్లో ఫ్యాషన్ గా మారింది. కొందరు వేసుకునే టాటూస్ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. అయితే టాటూస్ ఎలా తయారు చేస్తారంటే..మన చర్మంలో మూడు పొరలు ఉంటాయి. అన్నింటికన్నా పైనా ఎఫిడెన్సీ అనే లేయర్ ఉంటుంది. దీని కింద డెర్మిస్ అనే మరో పొర ఉంటుంది. దీని కొంద సబ్ట్యూట్యూయెస్ లేయర్ ఉంటుంది. టాటూస్ వేసేటప్పుడు ఓ మిషన్ వాడుతారు. ఈ మిషన్ చివరి బాగంలో కొన్ని సూదులు ఉంటాయి. మనకు కావాల్సిన టాటూస్ వేసేటప్పుడు ఆ సూదులు ముందుకు వెనుకకు కదులుతూ ఉంటాయి. వీటి ద్వారా ఇంక్ వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడ గాయాలవుతాయి.

    ఆ గాయాన్ని తగ్గించడానికి తెల్ల రక్త కణాలు అక్కడికి వెళ్తాయి. అయితే తెల్ల రక్త కణాలు మిషన్ ద్వారా పంపించే ఇంక్ ను తీసుకొని క్లీన్ చేస్తాయి. కానీ ఇంక్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది అక్కడే పర్మినెంట్ గా ఉండిపోతుంది. అక్కడే ఉండిపోయిన ఇంక్ టాటూస్ లా కనిపిస్తాయి. అయితే పర్మినెంట్ గా ఉన్న ఈ ఇంక్ ను లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తొలగించవచ్చు.

    కోర్టులో ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించిన తరువాత జడ్జి పెన్ నిబ్ ను విరిచేస్తారు. ఈ పద్దతి బ్రిటిష్ కాలం నుండి వస్తోంది. ఎందుకంటే.. ఆ పెన్ ద్వారా ఒకరికి మరణ శిక్ష విధించిన తరువాత ఆ పెన్ ఇతర కేసులకు వాడకూడదని అర్థం. ఉరిశిక్షకు కారణమైన ఆ పెన్ ఉండకూడదని విరిచేస్తారు. అంతేకాకుండా ఒక వ్యక్తి మరణానికి తాను కారణమైనందున ఆ ఆవేదనను తెలియజేయడానికే ఆ పెన్ ను విరిచేస్తారు.

    సిమ్ కార్డు మూడు వైపులా సమానంగా ఉండి ఒక వైపు క్రాస్ చేసి ఉంటుంది. ఇందుకు కారణం ఏంటంటే..?కొంత మంది సిమ్ కార్డును ఎలా పెట్టాలో తెలియందు. ఫోన్లో అమర్చిన చిప్ కు అనుగుణంగా సిమ్ ను పెడితేనే అది పనిచేస్తుంది. అలా తెలియిన వారికోసమే ఇలా ఒక వైపు ఫోన్ కు అనుగుణంగా సిమ్ ను కట్ చేసి పెడతారు. ఏటీఎంలో కార్డు కొందరు రివర్స్ పెట్టి ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఇబ్బందులు పడకుండా సిమ్ కార్డును అలా తయారు చేస్తారు.

    Also Read: Vomiting Sensation: ప్రయాణం చేసేటప్పుడు వాంతుల సమస్య.. అయితే ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చెయ్యండి!