
Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ అంతరంగం అంతుచిక్కడం లేదు. ఆయన ఏ పని చేసినా ఆచితూచి అడుగులేస్తున్నాడు. మిగతా రాజకీయ పార్టీల్లా మూస ధోరణీలో కాకుండా ఆయనకు ఒక సెపరేటు మార్గాన్ని వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను సుగమం చేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. యాత్రను ఎప్పుడు ప్రారంభిస్తారా? అని పార్టీ శ్రేణులతోపాటు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
వారాహి యాత్ర చేపట్టేందుకు సిద్ధమైనా.. ఇంకా ప్రారంభించలేదు. యాత్ర ఎక్కడ నుంచి ప్రారంభిస్తారోనన్న ఆసక్తిని అటు రాజకీయ పార్టీలతో పాటు అటు ప్రజల్లోనూ రేకేత్తిస్తుంది. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నారు. అంతకుమందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, జగన్, తెలంగాణాలో రేవంత్ రెడ్డి, షర్మిల వీరందరూ పాదయాత్రలు చేసినవాళ్లే. అంటే పాదయాత్రలు ప్రజలకు పాతబడిపోయాయ్.. అంతగా ఆసక్తిని చూపడం లేదనేది అర్థమవుతుంది.
ఈ క్రమంలోనే నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో కొద్దో గొప్పో ఆసక్తి ఉన్నా.. ఆశించిన స్థాయిలో లేదనేది అధికార పార్టీ నేతల అభిప్రాయం. ఆయన పాదయాత్రను మిగతా పార్టీలు నిశితంగా గమనిస్తున్నారు. ఈ ప్రభావం వారాహి యాత్రపై పడకుండా పవన్ కల్యాణ్ జాగ్రత్తలు తీసుకున్నట్లు కనబడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చివరి ఏడాది నుంచి 6 నెలలు కీలకం. ఆ సమయంలో చేపట్టే యాత్రలకు ప్రజా స్పందన బాగుంటుంది. ఆ మేరకు ఆయన వారాహి యాత్ర ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తుంది.
మరోపక్క జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్న తెలుగుదేశం పార్టీ ఇరుకున పెట్టేందుకు పవన్ కల్యాణ్ ఎత్తులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. జనసేన తోడు లేకపోతే అధికారం చేపట్టడం క్లిష్టంగా ఉంటుందనే సంకేతాలు అందిస్తున్నారు. ఆ మేరకు ఎక్కువ స్థానాలు పొందేందుకు కూడా సాధ్యమమవుతుంది. దీంతో రాజకీయ పరిస్థితులను బట్టి అధికారం చేపట్టే అవకాశానికి దగ్గరగా ఉంటారని పార్టీ శ్రేణులు చెబతున్నారు.
మరోపక్క సినిమాల్లోనూ పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు. రెండు సినిమాలు చేయడానికి సంతకాలు పెట్టారు. హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేయడంతో పాటు మరో సినిమా వేగంగా పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు. వీటి ద్వారా వచ్చే పారితోషికాన్ని కూడా పవన్ కల్యాణ్ తన వారహి యాత్రతోపాటు ఎన్నికలకు ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తుంది.