Most Polluted Countries : అభివృద్ధి మాటున కాలుష్యం బుసలుకొడుతుంది. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే.. దాని దేశంలో బోలెడంతా కాలుష్యాన్ని వెదజల్లుతున్నట్టే లెక్క. ఇక అత్యధికంగా ఉన్న జనాభాతోనూ కాలుష్య కాకారంగా దేశాలు మారుతున్నాయి. అభివృద్ధి ముసుగులో పర్యావరణాన్ని పట్టించుకోని దేశాలు ఇప్పుడు ప్రపంచంలోనే కలుషితమైనవిగా నిలిచాయి. వివిధ రకాల కాలుష్యం ఫలితంగా ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే అత్యంత కాలుష్య కారకమై శీతాకాలం వస్తే చాలు పొగమంచులో కూరుకుపోయి స్కూళ్లకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి. సరిగ్గా ఊపిరి కూడా ఆడని పరిస్థితులు నెలకొంటున్నాయి.

ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మరణాలకు వాయు కాలుష్యం కారణమవుతోంది. ఇప్పటికే అధిక కాలుష్యం కారణంగా 7 మిలియన్ లమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఒక అంచనా ఉంది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన 18 దేశాలలో 20 అభివృద్ధి చెందుతున్న దేశాలుండడం షాకింగ్ గా మారింది.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కారక దేశంగా బంగ్లాదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ చాలా తక్కువ గాలి నాణ్యతను కలిగి ఉంది. సగటున 97.10 కాలుష్య కణాలు గాలిలో ఉన్నాయి. బంగ్లాదేశ్ లో నివసిస్తున్న అధిక జనాభా (166 మిలియన్లకు పైగా ప్రజలు) ఈ కాలుష్య ఉద్గారాలకు కారణమవుతున్నారు. ఈ దేశం ఇటీవల పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి వస్త్రాలు, గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా పెద్ద ఎత్తున కాలుష్యం గాలిలో కలుస్తోంది. ఇవి అక్కడి ప్రజలకు శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులకు పెద్ద ఎత్తున కారణమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో బంగ్లాదేశ్ అథమ స్థాయిలో ఉంది.
స్విట్జర్లాండ్ కు చెందిన ప్రపంచ గాలి నాణ్యత రిపోర్ట్ 2021 రిపోర్ట్ ప్రకారం బంగ్లాదేశ్ తర్వాత అత్యంత కాలుష్య దేశంగా ‘చాద్’ నిలిచింది. ఇక మూడో స్థానంలో పాకిస్తాన్, నాలుగో స్థానంలో తజికిస్తాన్ లు ఉన్నాయి.ఇక భారత్ దేశం కూడా అత్యంత కాలుష్య కారకదేశాల్లో ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. ఆ తర్వాత స్థానాల్లో ఒమన్, కిర్గిజిస్తాన్, బెహ్రయిన్, ఇరాక్, నేపాల్ లు ఉన్నాయి.
ప్రపంచ కర్మాగారంగా ఉన్న చైనా మాత్రం ఏకంగా 22వ స్థానంలో ఉండడమే ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాలి నాణ్యత 2.5 పీఎంగా ఉండాలి. కానీ బంగ్లాదేశ్ లో అది 97 శాతం ఉండి అత్యంత కాలుష్యభరిత దేశంగా నిలిచింది.