ODI World Cup 2023 : వరల్డ్ క్రికెట్ లో నెంబర్ 3లో ఆడే ఐదుగురు బెస్ట్ ప్లేయర్లు వీళ్లే…

ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే ఆయన ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడుతూ మ్యాచ్ ని గెలిపించడమే కాకుండా ఒక భారీ ఇన్నింగ్స్ ని కూడా ఆయన ఆడగలడు...

Written By: NARESH, Updated On : October 4, 2023 5:53 pm

number 3 batsman

Follow us on

ODI World Cup 2023 : వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపధ్యం లో చాలామంది ప్లేయర్లు ఇండియన్ పిచ్ లకి అనుకూలంగా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకుంటూ మ్యాచులు ఆడటానికి రెడీ అవుతున్నారు. ఇక అందులో భాగంగానే ఏ టీం అయినా కూడా భారీ స్కోర్ చేయడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఆ టీం లోని నెంబర్ త్రి లో ఆడే ప్లేయర్ ఎలా ఆడుతున్నాడు అనే దానిమీదనే ఆ మ్యాచ్ స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.

నిజానికి ఒక టీం ఎంత బాగా ఆడుతుంది అనేది కూడా ఆ టీం లో ఉన్న నెంబర్ త్రి ప్లేయర్ మీదనే ఆధారపడి ఉంటుంది.ఎందుకంటే టీం మొదట బ్యాటింగ్ చేసిన లేదంటే ఛేజింగ్ చేసిన కూడా ఆ టీం ని ముందు ఉండి నడిపించే ప్లేయర్లు నెంబర్ త్రి ప్లేయర్లు కాబట్టి వాళ్లకి టీం లో చాలా ప్రాధ్యాన్యత ఉంటుంది. ఎందుకంటే ఓపెనర్లు ఎలాగూ ఎక్కువ సేపు ఆడలేరు, ఇక ఫినిషర్లు చివరి ఓవర్లలో వచ్చి మెరుపులు మెరిపించి వెళ్తారు,అలాగే ఇక మిగిలింది ఒక నెంబర్ త్రి ప్లేయర్ మాత్రమే కాబట్టి ఆయన అటు ఓపెనర్లతో కలిసి ఆడుతూ, అలాగే మిడిలాడర్ ప్లేయర్లతో కూడా కలిసి చివరి వరకు ఆడాలి అందుకని ఆయన ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండాల్సి ఉంటుంది.దానికోసమే ప్రతి టీం కి నెంబర్ త్రి ప్లేయర్ అనేవాడు చాలా కీలకంగా మారుతాడు…ఇక ప్రస్తుతం ఉన్న ఫామ్ ని బట్టి ప్రపంచం లో ఉన్న నెంబర్ త్రి లో ఆడే టాప్ ఫైవ్ ప్లేయర్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం…

5.కేన్ విలియం సన్
న్యూజిలాండ్ కి చెందిన విలియం సన్ ప్లేయర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా చాలా బాగా ఫెమస్ అయ్యాడు.ఇక నెంబర్ త్రి లో ఆడటం లో ఆయన చాలా మంచి ప్లేయర్…ఆయన ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం లో ఎప్పుడు రెడీ గా ఉంటాడు.అయితే ఆయన నెంబర్ త్రి లో ఆడినప్పుడు ఆయన అవరేజ్ 50.9 , స్ట్రైక్ రేట్ 81.4 గా ఉంది.ఇక ఆయనకి నెంబర్ త్ర్రీ లో మంచి అవరేజ్ ఉన్నప్పటికీ ఇండియాలో ఆయన నెంబర్ త్రి లో ఆడినప్పుడు మాత్రం పెద్దగా పర్ఫామ్ చేయలేదు.ఇండియా లో ఆయన అవరేజ్ 32.6 గా ఉంది.ఇక స్ట్రైక్ రేట్ మాత్రం 69.6 గా ఉంది.ఈయన మిగితా దేశాలలో బాగా ఆడినప్పటికీ ఇండియా లో మాత్రం నెంబర్ త్రి లో సరిగ్గా ఆడలేకపోతున్నాడు.దానికి కారణం ఏదైనా కూడా ఆయన ఈసారి దాన్ని అడగమించడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు…

4.స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా కి చెందిన ఈ ప్లేయర్ గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు. ఆస్ట్రేలియా టీం లో ఉన్న ముఖ్యమైన బ్యాట్స్ మెన్స్ లో ఆయన మొదటి స్థానం లో ఉంటాడు. ఇక ఇంతకు ముందు స్మిత్ నెంబర్ త్రి లో చాలా బాగా ఆడి ఆస్ట్రేలియా టీం కి చాలా గొప్ప విజయాలను అందించాడు.అయితే స్మిత్ ఇండియా లో కూడా చాలా బాగా ఆడుతాడు.ఒకసారి స్మిత్ యావరేజ్ కనక చూసుకుంటే ఆయన నెంబర్ త్రి లో వచ్చినప్పుడు ఆయన అవరేజ్ 53.9 గా ఉంది, అలాగే 86.9 స్ట్రైక్ రేట్ ఉంది.ఇండియా లో ఆయన ఆడిన మ్యాచులకి సంబందించిన అవరేజ్ ని కనక చూసుకుంటే 45.9 గా ఉంది.ఇక స్ట్రైక్ రేట్ వచ్చేసి 89.2 గా ఉంది…ఇక ఈ వరల్డ్ కప్ మ్యాచుల్లో ఈయన చాలా కీలకమైన ప్లేయర్ గా మారబోతున్నాడు…

3. జో రూట్
ఇంగ్లాండ్ లో చాలా కీలకమైన ప్లేయర్ గా మారిన జో రూట్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ప్రస్తుతం ఇంగ్లాండ్ టీం లో ఉన్న ప్లేయర్లలో జో రూట్ నెంబర్ త్రి లో పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యే ప్లేయర్ అనే చెప్పాలి.ఇంగ్లాండ్ టీం లో ఈయన ఉండటం చాలా గ్రేట్ అనే చెప్పాలి.ఎందుకంటే ఈయన ఛేజింగ్ లో ఒక లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడగలడు.ఇక ఈయన నెంబర్ త్రి లో ఆడినప్పుడు అవరేజ్ 50.1 గా ఉంది, అలాగే స్ట్రైక్ రేట్ 89.2 గా ఉంది.ఇక ఇండియా లో మాత్రం అవరేజ్ 66 కాగా, స్ట్రైక్ రేట్ 88 గా ఉంది…

2. బాబర్ అజమ్
పాకిస్థాన్ టీం లో కీలకమైన ప్లేయర్ అయిన బాబర్ అజమ్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్ లో నెంబర్ వన్ బ్యాట్స్ మెన్స్ గా కొనసాగుతున్నాడు.అయితే బాబర్ అజమ్ నెంబర్ త్రి లో అద్భుతమైన బ్యాటింగ్ తో పాకిస్థాన్ టీం కి చాలా వరకు విజయాలను అందించాడు.ఆయన ఆడిన ప్రతి మ్యాచ్ లో చాలా వరకు ఆ మ్యాచ్ ని గెలిపించడానికి ట్రై చేస్తాడు…ఇక బాబర్ అజమ్ నెంబర్ త్రి లో ఆడినప్పుడు ఆయన అవరేజ్ 62.4 గా ఉంది,ఇక స్ట్రైక్ రైట్ 89.4 గా ఉంది అయితే రీసెంట్ గా ఏషియా కప్ లో పాకిస్థాన్ టీం ఫెయిల్ అవ్వడం దానితో పాటుగా ఆయన కూడా కొన్ని మ్యాచుల్లో ఫెయిల్ అవ్వడం తో బాబర్ అజమ్ క్రేజ్ కొంతవరకు తగ్గింది…అయితే ఇంత వరకు తాను ఇండియా లో నెంబర్ త్రి లోఒక్కసారి కూడా ఆడలేదు కాబట్టి ఇప్పడు ఎలా ఆడుతాడు అనేది చూడాలి…

1.విరాట్ కోహ్లీ
ఇండియన్ ప్లేయర్లలో బెస్ట్ ప్లేయర్ అయినా కోహ్లీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు…పరుగులను కొట్టడం లో ఆయన ఒక గొప్ప బ్యాట్స్ మెన్ మ్యాచ్ ని గెలిపించడం లో ఆయనకి ఆయనే సాటి…అలాంటి విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్ లో చాలా కీలకమైన ప్లేయర్ గా అవతరించనున్నాడు.ఇక ఈయన నెంబర్ త్రి లో విదేశాలలో ఆడినప్పుడు ఆయన అవరేజ్ 60.2 గా ఉంది,ఇక స్ట్రైక్ రేట్ 94.9 గా ఉంది. ఇండియా లో ఆడినప్పుడు అయితే అవరేజ్ 61.5 కాగా, స్ట్రైక్ రేట్ 100.2 గా ఉంది.ఇక ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే ఆయన ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడుతూ మ్యాచ్ ని గెలిపించడమే కాకుండా ఒక భారీ ఇన్నింగ్స్ ని కూడా ఆయన ఆడగలడు…