Tilak Varma- Suresh Raina: తెలుగు రాష్ట్రాల నుంచి చాలా సంవత్సరాలు గా ఒక్క ప్లేయర్ కూడా ఇండియన్ టీం కి క్రికెట్ ఆడటం లేదు.ఇండియా తరుపున ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడటానికి ఒక్క సరైన తెలుగు ప్లేయర్ కూడా లేకపోవడం నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం అనే చెప్పాలి. ఈ విషయం లో హైద్రాబాద్ క్రికెట్ బోర్డు కంప్లిట్ గా ఫెయిల్ అయిపొయింది. ఇక చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ హైదరాబాద్ కి చెందిన తిలక్ వర్మ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం కి సెలెక్ట్ అయి తెలుగు వాళ్ళు అందరు గర్వపడేలా చేస్తున్నాడు… నిజానికి తిలక్ వర్మ ఇండియన్ టీం లో చోటు సంపాదించడానికి ముఖ్య కారణం ముంబై ఇండియన్స్ టీం అనే చెప్పాలి.ఎందుకంటే ఐపీల్ లో ఆయన ముంబై ఇండియన్స్ టీం కి ఆడటం వల్లే ఆయన టాలెంట్ ఏంటి అనేది క్రికెట్ అభిమానులందరికి తెలిసింది.ఇక దాంతో బిసిసిఐ దృష్టి ని ఆకర్షించిన వర్మ ని మొదట గా వెస్ట్ ఇండిస్ టి 20 సిరీస్ కోసం బిసిసిఐ ఎంపిక చేయడం జరిగింది. ఇక ఆ సిరీస్ లో తన టాలెంట్ ని వర్మ నిరూపించుకున్నాడు…అందుకే ఆయన్ని బిసిసిఐ ఆసియ కప్ కె సెలెక్ట్ చేసింది….కానీ అనుభవం.లేని కారణం గా ఆయన్ని వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేయలేదు… నిజానికి ఈయన నెంబర్ 4 లో అద్భుతం గా బ్యాటింగ్ చేయగలడు…
ఇక తిలక్ వర్మ ఇండియన్ టీం లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన బ్యాటింగ్, బౌలింగ్ అంత చూస్తున్న జనాలు ఆయన్ని సురేష్ రైనా తో పోలుస్తున్నారు…తిలక్ వర్మ కి, సురేష్ రైనా కి మధ్య కామన్ పాయింట్స్ ఎం ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం…
వీళ్లిద్దరు కూడా నవంబర్ నెల లోనే పుట్టారు.రైనా 1986 నవంబర్ 27 వ తేదీన పుట్టగా,తిలక్ వర్మ 2002 నవంబర్ 8 తేదీన పుట్టాడు…
ఇక ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ కావడం విశేషం అలాగే ఇద్దరు రైట్ హ్యాండ్ తో బౌలింగ్ చేస్తారు.ఇక ఇద్దరు కూడా ఐపీల్ లో ఆడిన రెండో మ్యాచ్ లోనే వాళ్ళ మొదటి హాఫ్ సెంచరీ చేసారు.
రైనా తాను ఆడిన మొదటి ఐపీల్ సీజన్ లోనే 350 కి పైన రన్స్ చేసారు.అలాగే తిలక్ వర్మ కూడా ఆయన ఆడిన మొదటి ఐపీల్ సీజన్ లో 350 ప్లస్ రన్స్ చేసారు.ఇక ఇద్దరు కూడా మొదటి ఐపీల్ ఇచ్చిన ఉత్సాహంతో రెండో ఐపీఎల్ ఆడి అందులోనూ 340 ప్లస్ రన్స్ చేసారు.ఇద్దరు కూడా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ 20 సంవత్సరాల వయసులోనే ఆడారు…
ఇక ఇద్దరు ఆడిన మొదటి టి 20 మ్యాచ్ లోనే ఇద్దరు రెండు క్యాచులు పట్టుకున్నారు. అలాగే ఇద్దరు కూడా కెరియర్ మొదట్లో రన్ ఛేజ్ చేసే టైం లోనే 49 పరుగుల వద్ద నాటౌట్ గా నిలిచారు…
వాళ్ళు బౌలింగ్ చేసిన మొదటి ఓవర్లలోనే ఇద్దరు కూడా మొదటి వికెట్ తీసుకున్నారు…ఇక ఈ ఇద్దరు ప్లేయర్ల విషయం లో ఇంత సిమిలారిటీ ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి అయితే ఒకప్పుడు సురేష్ రైనా మిడిలాడర్ లో చాలా బాగా ఆడుతూ ఇండియా టీం కి మంచి విజయాలను అందించేవాడు… ఇప్పుడు తిలక్ వర్మ కూడా మిడిలాడర్ లో ఇండియా టీం కష్టాలని తీరుస్తూ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడుతాడో లేదో చూడాలి…