Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు చాలా మంచి నటుడు అనే చెప్పాలి. ఈయన హీరోగా వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి వసూళ్లను సాధించాయి. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు సినిమాలను చేస్తూ అలాగే సినిమాల్లో చాలా ప్రయోగాలను కూడా చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను కూడా సంపాదించుకున్నాడు ఇక ఆయన చేసిన మాస్ సినిమాలకు కాను ఆయన సూపర్ స్టార్ గా ఎదిగాడు…వల్ల నాన్న ఇన్స్పిరేషన్ తో సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారి పేరుని చెడగొట్టకుండా కృష్ణ గారి కొడుకు మహేష్ బాబు అని అనిపించుకోకుండా మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అని చెప్పుకునేంత స్థాయిని ఎదిగాడు అంటే ఆయన చాలా కష్టపడ్డాడు అనే చెప్పాలి. ఎవరికి సాధ్యం కాని విధంగా వరుసగా నాలుగు సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. భరత్ అనే నేను, మహర్షి,సరిలేరు నీకెవ్వరూ, సర్కార్ వారి పాట ఈ నాలుగు సినిమాలతో మహేష్ బాబు ఇండస్ట్రీలో 100 కోట్లు కలెక్ట్ చేసిన హీరోగా నిలిచాడు.వరుసగా నాలుగు సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు ఆ ఘనతని మహేష్ బాబు సాదించాడు అంటే ఆడియెన్స్ లో ఆయన ఫాలోయింగ్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ మంచి అంచనాలతో ఉన్నారు ఇక ఏ సినిమాకూడా 100 కోట్ల కలక్షన్స్ ని రాబట్ట గల్గితే మహేష్ బాబు వరుసగా 5 సినిమాలతో 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన హీరో గా మహేష్ బాబు హిస్ట్రోయ్ లో నిలుస్తాడు. ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా ముగిసిన తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ప్యాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఏకంగా 3000 కోట్ల వరకు కలెక్ట్ చేయగలుగుతుందనే అంచనాలైతే ఉన్నాయి. ముందుగా త్రివిక్రమ్ గారి సినిమా అయిపోతే ఆ తర్వాత రాజమౌళి సినిమా మీదికి వెళ్తాడు మహేష్ బాబు… అయితే గుంటూరు కారం సినిమా 2024 సంక్రాంతికి వస్తున్నట్టుగా తెలుస్తుంది..ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా లో హీరోయిన్ గా శ్రీలీలా ని తీసుకున్నప్పటికీ ఆ తరువాత ఆవిడని తప్పించి ఆమె ప్లేస్ లో శ్రీలీలా ని మెయిన్ హీరోయిన్ గా సెట్ చేశారు…