Bigg Boss 7 Telugu : సీక్రెట్ ఫలించింది.. ఈసారి ఎవ్వరూ ఊహించని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీరే.. కానీ షాక్ లగా..

ఈసారి ఎంతో మంది బిగ్ బాస్ లోకి వెళుతున్నారని.. సెలబ్రెటీలు ఉన్నారని అనుకున్నారు. చాలా మందిని వీరు ఈసారి బిగ్ బాస్ లో ఉంటారని ఊహించారు. కానీ అలా జరగలేదు.

Written By: NARESH, Updated On : September 4, 2023 7:19 pm

bigg-boss-7-telugu-started

Follow us on

Bigg Boss 7 Telugu : దసరా, దీపావళి సీజన్లను టార్గెట్ చేసి తెలుగు నాట మొదలయ్యే ‘బిగ్ బాస్’ ఈసారి కూడా ఘనంగా లాంచ్ అయ్యింది. అయితే పోయినసారి.. అంతకుముందు సారి లాంటి హైప్ ఈసారి బిగ్ బాస్ కు రాలేదనే చెప్పాలి. మొదటి 5 సీజన్ల వరకూ ప్రముఖులైన సెలబ్రెటీలను పట్టుకొచ్చి.. కావాల్సినంత మసాలా దట్టించడంతో అవి తెగ పాపులర్ అయ్యింది. మంచి మంచి ఆర్టిస్టులతో కావాల్సినంత హైప్ ప్రజల్లోనూ వచ్చింది. ఏకంగా వారి అభిమాన సంఘాలు ఏర్పడి గెలుపు కోసం ఓట్ల వర్షం కురిసింది.

కానీ 5వ సీజన్ నుంచే డౌన్ ఫాల్ మొదలైంది. పోయిన 6వ సీజన్ అయితే ఫ్లాప్ అయ్యిందనే చెప్పాలి. సరైన ఎలిమినేషన్లు లేక.. ఓటింగ్ తగ్గట్టుగా ఎలిమినేట్ కాకపోవడంతో జనాలు అందరూ ‘బిగ్ బాస్’ మోసం చేస్తోందని చూడడం మానేశారు. మంచి మంచి ఫన్ చేసే వారిని బిగ్ బాస్ నుంచి పంపించేసి.. ఏమీ చేయని వారిని బిగ్ బాస్ హౌస్ లో ఉంచేశారు. అసలు వారికి ఎవరు ఓటు వేశారు. ? ఎందుకు వారిని ఉంచుతున్నారన్న సందేహాలు కలిగి పోయిన సీజన్ ను ఎవరూ చూడకపోవడంతో అది ఫ్లాప్ అయ్యింది.

అందుకే ఈసారి ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ కు మళ్లీ వన్నెతెచ్చేందుకు రెడీ అయ్యారు. కొత్త సీజన్, కొత్త కాన్సెప్ట్ ను బయటపెట్టారు. ఈసారి కూడా హైప్ రాలేదు. అయితే షో లాంచ్ అయ్యాక కంటెస్టెంట్లను చూస్తే పెద్దగా ప్రముఖులు లేకపోవడంతో మరోసారి చప్పగానే స్ట్రాట్ అయ్యింది. ఉల్టా పల్టా ఈసారి అన్నారు కానీ అందుకు తగ్గట్టుగా ఏం చేయలేదు. కేవలం కంటెస్టెంట్లకు బెడ్స్, సోఫాలు, కుర్చీలు ఇవ్వకుండా మొదటి రోజే షాకిచ్చారు. ఇక నాగార్జున హౌస్ ను పరిచయం చేయకుండా తొలి కంటెస్టెంట్ అయిన ప్రియాంకకు ఆ ఛాన్స్ ఇచ్చారు. ఆమె కూడా హౌస్ ను ప్రేక్షకులకు సరిగ్గా చూపించకపోవడంతో హౌస్ ఎలా ఉందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఏ రూం ఎక్కడుందో లోపలికి వెళ్లినవారికి కూడా తెలియలేదు.

సరే షో లాంచ్ అయిపోయింది.. హౌస్ లోకి వెళ్లిన వారిలో ఎవరైనా సెలబ్రెటీలు ఉన్నారంటే అంతా థర్డ్ క్లాస్ వారే.. ఒకరిద్దరూ టీవీ సీరియల్ ఆర్టిస్టులు తప్ప తెలిసిన మొహం లేరు. ఉన్న వారిలో ఒక్క నటుడు శివాజీ తప్ప పెద్ద ఆర్టిస్టులే లేరు. చాలా మంది ఇందులో పాల్గొనడానికి ఆసక్తి చూపించలేదా? కాంట్రావర్సీకి దూరంగా ఉన్నారా? లేక సెలబ్రెటీలను తీసుకురావడంలో బిగ్ బాస్ టీం విఫలమైందా? తెలియదు కానీ.. మొత్తంగా చప్పటి ముఖాలతో బిగ్ బాస్ హైప్ రాలేదు. అసలు హౌస్ లోకి వెళ్లిన వారు ఎవరో కూడా ఇప్పటివరకూ ఎవరికీ తెలియని వారు కొందరున్నారు.

ఈసారి ఎంతో మంది బిగ్ బాస్ లోకి వెళుతున్నారని.. సెలబ్రెటీలు ఉన్నారని అనుకున్నారు. చాలా మందిని వీరు ఈసారి బిగ్ బాస్ లో ఉంటారని ఊహించారు. కానీ అలా జరగలేదు.

బిగ్ బాస్ టీం సీక్రెట్ బాగానే ఫలించింది. నటుడు శివాజీ బిగ్ బాస్ లోకి వెళుతున్నాడని ఎవ్వరూ ముందుగా ఊహించలేదు. మీడియా, యూట్యూబ్ చానెల్స్ పసిగట్టలేదు. కానీ ఆయన హౌస్ లోకి వచ్చాడు. నాగార్జున కూడా ‘నువ్వు వస్తావని నేనూ ఊహించలేదయ్యా.. సడెన్ షాక్ ’ అని శివాజీతో అన్నాడు. ఇక ఎవ్వరూ ఊహించని రివీల్ కాని కంటెస్టెంట్లను చూసే.. ‘శుభ శ్రీ, ప్రియాంక, పావనీ ప్రశాంత్, యావర్, రతిక, టేస్టీ తేజ, డాక్టర్ గౌతం కృష్ణ(ఆకాశం వీధిలో మూవీ హీరో)’ లు పూర్తిగా కొత్త వారు. ఎవ్వరూ ఊహించని వారు.

బిగ్ బాస్ సీక్రెట్ మెయింటేన్ చేసి వీరిని లోపలికి పంపింది. కానీ వీరు ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. దీంతో అనామకులకు అవకాశం ఇచ్చారా? అన్నా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే పెద్ద షాక్ లా మారింది.