https://oktelugu.com/

Ghulam Nabi Azad : భారత చరిత్రను తిరగరాయాల్సిన అవసరం ఎంతైనా వుంది

600 సంవత్సరాల క్రితం.. కశ్మీర్ లో ఉన్న ముస్లింలు అందరూ కూడా హిందువులే.. ఇది చరిత్ర దాచలేని వాస్తవం అని గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఆధునిక చరిత్రకు ఆధారాలున్నాయి. ఆ ఆధారాలతోనే ఆజాద్ మాట్లాడారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 18, 2023 / 12:48 PM IST

    Ghulam Nabi Azad  : గులాం నబీ ఆజాద్ తాజాగా శ్రీనగర్ లో మాట్లాడిన మాటల మీద చాలా పెద్ద వివాదం నడుస్తోంది. అసలు ఆ మాటల్లో వివాదం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.

    600 సంవత్సరాల క్రితం.. కశ్మీర్ లో ఉన్న ముస్లింలు అందరూ కూడా హిందువులే.. ఇది చరిత్ర దాచలేని వాస్తవం అని గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఆధునిక చరిత్రకు ఆధారాలున్నాయి. ఆ ఆధారాలతోనే ఆజాద్ మాట్లాడారు.

    ఆజాద్ మంచి పాజిటివ్ కోణంలోనే చూడాలి. క్రిస్టియన్, ముస్లిం, హిందువు అయినా అందరూ ఒక్కటేనని.. అందరూ చనిపోయిన వారంతా మళ్లీ పుడుతారంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాటలకు అందరూ ఆజాద్ మీద ఎందుకు పడిపోతున్నారన్నది చెప్పాలి.

    సోకాల్డ్ సెక్యూలరిస్టులు ఆజాద్ పై విరుచుకుపడుతున్నారు. చరిత్రను చరిత్రగా చెబితే తప్పా? అన్నది ఆలోచించాలి. ఇలాంటి వింత పరిస్థితి భారత్ లోనే ఉంటుంది. చరిత్రను చరిత్రగా చెప్పడం ఏ దేశంలో వ్యతిరేకించరు. చరిత్రనుంచి గుణపాఠం నేర్చుకోవాలి కానీ.. దాన్ని కప్పిపుచ్చొద్దు..

    భారత చరిత్రను తిరగరాయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.