Homeప్రత్యేకంIT Sector: ఉద్యోగాలు ఉఫ్‌.. ఐటీరంగం ఢమాల్‌.. భారత్‌ లో పరిస్థితేంటి?

IT Sector: ఉద్యోగాలు ఉఫ్‌.. ఐటీరంగం ఢమాల్‌.. భారత్‌ లో పరిస్థితేంటి?

IT Sector: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో మరోసారి కుదుపు మొదలైంది. ట్విట్టర్‌ను టేకోవర్‌ చేసిన ఎలన్‌మస్క్‌ 50 శాతం ఉద్యోగులను తొలగించారు. ఇండియాలో అయితే 90 శాతం ఉద్యోగులను తీసేశాడు. మెటా సంస్థ కూడా దాదాసు 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా అమెజాన్‌ కూడా 10 వేల మందిని ఇంటికి పంపాలని నిర్ణయించింది. ఇండియాలో బైజూస్‌ 2 వేల మంది తొలగించాలని ఆదేశించింది. మరికొన్ని కంపెనీలు కూడా ఉద్యోగాల తొలగింపుపై దృష్టిపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి ఇప్పడు ఐటీ రంగ ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ఐటీ రంగం భవిష్యత్‌ ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది.

IT Sector
IT Sector

గ్లోబల్‌ ఐటీరంగంపై ప్రభావం..
ప్రస్తుతం ఉన్న కుదుపు గ్లోబల్‌ ఐటీ కంపెనీల్లో ఎక్కువగా ఉంది. ఐటీ రంగం ప్రపంచమంతా ప్రభావం చూపే సంస్థ. ప్రపంచ ఎకానమీల్లో వచ్చే ప్రభావం ఇండియన్‌ ఎకానమీపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే ప్రస్తుత ఐటీ ప్రభావం ఇండియాలో ఎలా ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది అన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఇన్‌ఫోసిస్‌ కోఫౌండర్‌ ఎస్‌.గోపాలకృష్ణణ్‌.. మాట్లాడుతూ ఇండియన్‌ ఐటీ రంగం గ్లోబల్‌ ఎకానమీ ప్రభావం నుంచి ఇండియన్‌ ఐటీ రంగం కూడా ప్రభావితం అయిందని తెలిపారు. అయితే భారీగా ఉండదని పేర్కొన్నారు. ఇండియన్‌ ఐటీ కంపెనీలు త్వరలోనే మళ్లీ పుంజుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు.

త్వరలోనే వృద్ధి..
ఐటీరంగం ఇడియా టర్నోవర్‌ రూ.22 లక్షల కోట్లు. ప్రస్తుత ఐటీ కుదుపుతో టర్నోవర్‌ 8 నుంచి 10 నెలలు తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వృద్ధిరేటు 8 నుంచి 10 శాతం వరకూ నమోదవుతుందని పేర్కొంటున్నారు. ఎప్పుడైనా ఏ రంగంలో అయినా సంక్షోభం తలెత్తితే అది ఎనిది నుంచి పది నెలలు ఉంటుందని, ప్రస్తుత ఐటీరంగంలో వచ్చింది కూడా అంతకంటే ఎక్కువ కాలం ఉండదని చెబుతున్నారు.

నిలబడేందుకు కారణాలు అనేకం..
ఇండియన్‌ ఐటీరంగం నిలబడేందుకు కొన్ని కారణాలను ఐటీ నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్యాండమిక్‌ సమయంలో డిజిటలైజేషన్‌ పెరిగింది. ఐటీని అడాప్ట్‌ చేసుకోవడం పెరుగతోంది. దీంతో ఐటీరంగానికి ఊపు తెస్తోంది. ఇదే సమయంలో ఐటీ రంగం ఎకానమీపై ప్రభావితం చూపుతోంది. ఆధునికతకు అనుగుణంగా ఐటీరంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్స్‌ ప్రభావం డెవలప్‌మెంట్‌పై ఉంటుంది. ఇన్నోవేషన్స్‌ ఆగిపోతే దాని ప్రభావం డెవలప్‌మెంట్‌పై పడుతుంది. ఇది ఇండియాలోనూ జరుగుతుంది. అయితే గ్లోబల్‌వైడ్‌ డెవలప్‌మెంట్‌తో పోల్చితే ఇండియాలో కొంత నిదానంగా ఉంటుంది. అప్పటిలోగా గ్లోబల్‌ ఐటీరంగం పుంజుకుటుంది. దీంతో ఇడియా ఐటీరంగం తక్కువ ప్రభావంతో బయటపడుతుందని చెబుతున్నారు.

IT Sector
IT Sector

అప్‌డేట్‌ అయితేనే అభివృద్ధి..
ఇక ఏ రంగంలో అయినా.. కాలంతోపాటు మార్పులు రావాలి.. చేసుకోవాలి. ఉద్యోగులు కూడా అప్‌డేట్‌ కావాలి. ఇంది అన్నిరంగాల్లో ఉన్నప్పటికీ ఐటీ రంగంలో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం టెక్నాలజీ అప్‌డేట్‌తోపాటు అడాప్షన్‌ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఇదే సంధికాల ఐటీరంగంలో నడుస్తోంది. ఎకానమీతోపాటు అడాప్షన్‌కు అనుగుణంగా మార్పులు జరిగితే తిరిగి ఐటీరంగం పుజుకోవడం ఖాయం. ఈమేరకు ఐటీరంగ నిపుణులు అప్‌డేట్‌ అవుతున్నారు. దీని ప్రభావంతో మళ్లీ ఐటీ సెక్టార్‌ పుంజుకుంటుందని నిపుణులు ఆశాభావం, ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular