Robbery thief: మరీ కక్కుర్తిలో కమండలం అంటే ఇదేనేమో.. కరోనా టైంలో ఆస్పత్రిలో పనిచేసిన ఈ దొంగ ఇప్పుడు డబ్బుల కోసం ఏకంగా మత్తు మందు ఇచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందే బాలింతల బంగారాన్ని అపహరించేస్తున్నాడు. ఏం జరుగుతుందో తెలియని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నిలువుదోపిడీ కేటుగాడి కథ సుఖాంతమైంది.

వార్డు బాయ్ అవతారంలో కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వార్డులో ఉన్న రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి రోగుల ఒంటి పై ఉండే బంగారు ఆభరణాలు చోరి చేస్తున్న కేటుగాడిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కడప నగరంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన వేముల మణిదీప్ కరోనా సమయంలో కొద్ది రోజులు రిమ్స్ కోవిడ్ వార్డ్ లో వార్డ్ బాయ్ గా పని చేశాడు.అక్కడ పనిచేసిన పరిచయాలతో రిమ్స్ ఆసుపత్రిలో నకిలీ వార్డ్ బాయ్ అవతారంలో గైనకాలజీ వార్డులో ఉన్న బాలింతలకు సెలైన్ బాటిల్ కు మత్తు మందు ఇచ్చి బాలింత ఒంటిపై ఉన్న 22తులాల బంగారు ఆభరణాలు చోరి చేశాడు.
రిమ్స్ లో డాక్టర్ల పర్యవేక్షణ సరిగా లేకపోవడం తో అప్పుడప్పుడు అదేవిధంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు.బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిమ్స్ హాస్పిటల్ లో సి.సి.కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడి నుండి 22తులాల బంగారు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.