ODI World Cup : 2019 వరల్డ్ కప్ ఫైనల్లో విజేత న్యూజిలాండే…కానీ ఎంపైర్ తప్పుతో ఇంగ్లండ్ కు కప్

2019 వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కూడా ఒక పెద్ద తప్పు అనేది జరిగింది. అందువల్లే న్యూజిలాండ్ టీం ఓడిపోయింది ఇంగ్లాండ్ టీం గెలిచింది.

Written By: Gopi, Updated On : October 4, 2023 8:09 pm

2019 World Cup Final

Follow us on

2019 World Cup Final: ప్రస్తుతం ప్రపంచం మొత్తం వరల్డ్ కప్ కోసం ఆసక్తి గా ఎదురు చూస్తుంది.ఇక ఈ వరల్డ్ కప్ లో మ్యాచులు గెలవాలంటే అది ప్లేయర్లు బాగా ఆడితే గెలుస్తారు, కానీ కొన్ని సార్లు ప్లేయర్లు ఎంత బాగా ఆడిన కూడా ఎంపైర్లు చేసే మిస్టేక్స్ వల్ల కూడా కొన్ని మ్యాచులు ఓడిపోవాల్సి వస్తుంది.అయితే అవి నార్మల్ మ్యాచ్ లు అయితే ప్రాబ్లమ్ లేదు కానీ కొన్ని సార్లు ఫైనల్ మ్యాచ్ లు సైతం ఓడిపోవాల్సి వస్తుంది.అందుకే వరల్డ్ కప్ లో ఎంపైర్లు చాలా మంచి వారు ఉండాలి అనేది ప్రతి టీం కూడా కోరుకుంటుంది.ఇక ఇప్పుడంటే ఒక ప్లేయర్ అవుట్ అయితే ఆయన ఔటా, కదా అనేది తేలడానికి రివ్యూ సిస్టం (డి ఆర్ ఎస్) ఉంది కానీ,ఒకప్పుడు ఎంపైర్ నిర్ణయమే ఫైనల్ చేసే వారు ఆయన అవుట్ అంటే అవుట్ లేదంటే లేదు అలా ఉండేది అలాంటప్పుడు చాలా మంది ప్లేయర్లు చాలా సార్లు అనవసరంగా అవుట్ అవ్వాల్సి వచ్చేది.అందుకే ప్రస్తుతం ఈ రివ్యూ సిస్టం (డి ఆర్ ఎస్) ని తీసుకువచ్చారు…

అయితే 2019 వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కూడా ఒక పెద్ద తప్పు అనేది జరిగింది. అందువల్లే న్యూజిలాండ్ టీం ఓడిపోయింది ఇంగ్లాండ్ టీం గెలిచింది.అదేంటి అంటే ఇంగ్లాండ్ చివరి ఓవర్ల లో 15 రన్స్ కొట్టాల్సి ఉండగా ట్రెంట్ బౌల్ట్ తాను వేసిన మొదటి రెండు బాల్స్ ని డాట్ బాల్స్ గా వేసాడు, ఇక మూడోవ బాల్ కి స్టోక్స్ సిక్స్ కొడతాడు,ఇక నాలుగోవ బాల్ కి స్టోక్స్ బౌండరీ సైడ్ ఒక భారీ షాట్ కొడితే దాన్ని గుప్తిల్ బౌండరీ రాకుండా ఆపేసి వికెట్ కీపర్ సైడ్ త్రో చేయగా అది పరుగెడుతున్న స్టోక్స్ కి తగిలి బౌండరీ వెళ్ళింది.అయితే అప్పుడు ఎంపైర్ వీళ్లు తీసిన రెండు పరుగులు ఓవర్ త్రో లో వచ్చిన 4 పరుగులు మొత్తం కలిపి 6 పరుగులు ఇచ్చాడు.

దాంతో ఇంకో 2 బాల్స్ కి 3 రన్స్ కొట్టాల్సి ఉండగా అది టై అయిపోతుంది దాంతో సూపర్ ఓవర్ ఆడుతారు,ఆ సూపర్ ఓవర్ కూడా టై అవ్వడం తో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కొట్టిన బౌండరీస్ ఎక్కువ గా ఉన్నాయని ఇంగ్లాండ్ ని విన్నర్స్ గా ప్రకటించడం జరిగింది.కానీ ఇక్కడ ఎంపైర్ తప్పిదం వల్ల న్యూజిలాండ్ గెలవాల్సిన మ్యాచ్ అనవసరం గా ఓడిపోయింది.ఎలా అంటే గుప్తిల్ ఓవర్ త్రో వేసినప్పుడు MCC రూల్ 19.8 ప్రకారం ఒక ఫీల్డర్ బాల్ త్రో చేసినప్పుడు వికెట్ల మధ్య రన్స్ కోసం పరుగెడుతున్న ప్లేయర్లు ఒకరిని ఒకరు క్రాస్ అవ్వాలి.అంటే ఫీల్డర్ ఎప్పుడైతే బాల్ త్రో చేస్తాడో కరెక్ట్ గా అదే టైం కి ప్లేయర్లు ఇద్దరు ఒకరిని ఒకరు క్రాస్ అవ్వాలి.

ఒకవేళ అలా క్రాస్ అవ్వకపోతే ఆ బాల్ కనక బౌండరీ వెళ్తే సెకండ్ రన్ తీసినప్పుడు ఫీల్డర్ త్రో వేసే టైం కి ఒకరిని ఒకరు క్రాస్ అవ్వకపోతే వాళ్ళు తీసిన రెండు పరుగులో ఒక పరుగు మాత్రమే ఇచ్చి బాల్ ఎలాగో బౌండరీ వెళ్ళింది కాబట్టి దాన్ని ఫోర్ గా పరిగణించి ఇక్కడ తీసిన రెండు పరుగులో ఒక్క పరుగు మాత్రం లెక్కలోకి తీసుకొని ఫోర్ తో కలిపి 5 పరుగులు మాత్రమే టీం కి ఇవ్వాలి ఒక వేళ బాల్ బౌండరీ దాటకపోతే కనక అప్పుడు ఈ రెండు పరుగులు వస్తాయి. బౌండరీ వెళ్తే మాత్రం ఆ ముందు తీసిన పరుగు ఒక్కటే లెక్కలోకి వస్తుంది.

అప్పుడున్న హడావిడిలో ఎంపైర్ ఇవన్నీ పట్టించుకోకపోవడం వల్ల న్యూజిలాండ్ టీం ఓడిపోవాల్సి వచ్చింది. ఆ రూల్ కనక కరెక్ట్ గా ఫాలో అయితే న్యూజిలాండ్ ఒక్క రన్ తో వరల్డ్ కప్ గెలిచేది…మ్యాచ్ గెలిచి అంత అయిపోయాక వాళ్ళకి కప్ ఇచ్చేసాక ఈ MCC రూల్ గురించి MCC చీఫ్ కమిట్ మెంబర్ అయిన సైమన్ టఫ్ చెప్పడం జరిగింది… ఎంతైనా 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ టీం కి చాలా పెద్ద అన్యాయం జరిగిందనే చెప్పాలి…