MS Dhoni’s vintage look :  ధోని వింటేజ్ రూపం వెనక అసలు సంగతి అదా?

అన్నట్టు ధోని అలా ఎంట్రీ ఇవ్వడంతో తమిళ అభిమానులు తలా అంటూ సంబోధిస్తున్నారు. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగుపెడుతున్న చెన్నై జట్టును.. ఈసారి కూడా ధోనీ ఐపీఎల్ విన్నర్ ను చేస్తాడా? తన కెరియర్ ముగింపుకు గ్రాండ్ ఇస్తాడా? ఈ ప్రశ్నలకు మరి కొద్ది రోజుల్లో సమాధానం లభిస్తుంది.

Written By: NARESH, Updated On : March 7, 2024 10:37 pm

The real story behind Dhoni's vintage look

Follow us on

MS Dhoni’s vintage look :  ఇటీవల ఫేస్ బుక్ లో కొత్త పాత్రకు సిద్ధమంటూ టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక పోస్ట్ చేశాడు. అలా పోస్ట్ చేయడమే ఆలస్యం అది వెంటనే చర్చనీయాంశం అయిపోయింది. మీడియా నుంచి సోషల్ మీడియా దాకా ధోని అలా ఎందుకు పోస్ట్ చేశాడంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టింది. ఇక క్రీడా విశ్లేషకులయితే రకరకాల కథనాలు అల్లడం మొదలుపెట్టారు. ధోని ఈ సీజన్ కెప్టెన్ గా ఉండడని, కోచ్ అవతారం ఎత్తుతాడని, మెంటార్ గా పనిచేస్తాడని ఏవేవో వ్యాఖ్యలు చేశారు. కానీ అలాంటి సంకేతాలు ధోని ఇవ్వలేదు. పైగా జులపాల జుట్టుతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన అధికారిక యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఆ వీడియోను పోస్ట్ చేయడమే ఆలస్యం లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది. వాస్తవానికి ఐపీఎల్ సీజన్ ప్రారంభమై 16 సంవత్సరాలు గడిచిపోయింది. దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లు మారిపోయారు. ఒక్క మహేంద్ర సింగ్ ధోని మాత్రం అలానే ఉన్నాడు. 2008లో చెన్నై కెప్టెన్ గా నియమితుడైన నాటి నుంచి అతడు అలానే ఉన్నాడు. ఏకంగా చెన్నై జట్టును ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. అక్కడిదాకా ఎందుకు ముంబై జట్టును ఐదుసార్లు ఐపీఎల్ విన్నర్ ను చేసిన రోహిత్ శర్మ ఈసారి సాధారణ ఆటగాడి గానే బరిలోకి దిగబోతున్నాడు. కానీ ధోని ఎవర్ “ఎల్లో” కెప్టెన్ గా కొనసాగుతున్నాడు..

ఐపీఎల్ 17 వ సీజన్ ప్రారంభం కాకముందే కొత్త పాత్రకు సిద్ధమంటూ అతడు చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ధోని సరికొత్త హెయిర్ స్టైల్ తో దర్శనం ఇవ్వడం.. వింటేజ్ లుక్ లో కనిపించడంతో.. సరికొత్త పాత్రకు సిద్ధం అని ధోని అన్నది ఇందుకోసమే కావచ్చని అభిమానులు చర్చించుకుంటున్నారు. గత ఏడాది సీజన్లో ధోని అద్భుతమైన ఫినిషింగ్ ఇన్నింగ్స్ లు ఆడాడు. అయితే చివరి ఐపీఎల్ టోర్నీ ఆడుతున్న నేపథ్యంలో ధోని అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. గత సీజన్ తోనే ధోనీ తన ఇన్నింగ్స్ ముగిస్తాడని చాలామంది అనుకున్నారు. కానీ అనుకోకుండా ఈసారి సీజన్లోనూ అతడు చెన్నై కెప్టెన్ గా బరిలోకి దిగాడు. అందరికంటే ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బరువు కూడా తగ్గాడు.. వింటేజ్ ధోనీ లాగా కనిపిస్తున్నాడు. మొత్తానికి తన కొత్త పాత్ర ఇదని క్లారిటీ ఇచ్చాడు. అన్నట్టు ధోని అలా ఎంట్రీ ఇవ్వడంతో తమిళ అభిమానులు తలా అంటూ సంబోధిస్తున్నారు. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగుపెడుతున్న చెన్నై జట్టును.. ఈసారి కూడా ధోనీ ఐపీఎల్ విన్నర్ ను చేస్తాడా? తన కెరియర్ ముగింపుకు గ్రాండ్ ఇస్తాడా? ఈ ప్రశ్నలకు మరి కొద్ది రోజుల్లో సమాధానం లభిస్తుంది.