Justice Party : జస్టిస్ పార్టీ బ్రిటీష్ అనుకూల, భారత్ వ్యతిరేక అగ్రకుల పార్టీ

మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎక్కువభాగం బ్రాహ్మణులు ఉండేవారు. ఎక్కువ శాతం ఇంగ్లీష్ వారు చదువుకొని కీలక ఉద్యోగాలు వారు చేజిక్కించుకున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని మాకు అన్యాయం జరగడానికి బ్రాహ్మణులు కారణమని..

Written By: NARESH, Updated On : September 19, 2023 4:35 pm

Justice Party : అందరూ అనుకుంటున్నట్టు జస్టిస్ పార్టీ సామాజిక న్యాయం కోసం ఉద్భవించిన పార్టీ కాదు. అధికారం కోసం జరిగిన పోరాటంలో మొత్తం బ్రాహ్మణుల చేతుల్లో ఉన్న అధికారాన్ని తమ వైపు తిప్పుకోవడానికి మిగతా అగ్రకులాలు చేసిన పోరాటం. ఈ పార్టీ మూలాలు చూస్తే దీని కథేంటి అన్నది అర్థమవుతుంది.

మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎక్కువభాగం బ్రాహ్మణులు ఉండేవారు. ఎక్కువ శాతం ఇంగ్లీష్ వారు చదువుకొని కీలక ఉద్యోగాలు వారు చేజిక్కించుకున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని మాకు అన్యాయం జరగడానికి బ్రాహ్మణులు కారణమని.. మిగతా వర్గాల వారు ఉద్యమం లేవనెత్తారు. మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్రా తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఇది జరిగింది.

వీళ్లు అంతా బాగా భూములున్న వారు, జమీందారులు, రాజాలు కావడం గమనార్హం. అణగారిన జాతుల వారు అస్సలు కాదు. శెట్టియార్, మొదలియార్, రెడ్డి, వెలమ, కమ్మ, బలిజ, కాపు వంటి బలమైన సామాజికవర్గాల వారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. వీరంతా కూడా ఇప్పుడు జస్టిస్ పార్టీ పెట్టారు.

జస్టిస్ పార్టీ బ్రిటీష్ అనుకూల, భారత్ వ్యతిరేక అగ్రకుల పార్టీ దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.