Janasena: జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి ఉమ్మడి ఏపీని పాలించిన తొట్టతొలి దళిత ముఖ్యమంత్రిపై సంచలన ప్రతిపాదన చేశారు. ఆయనను పార్టీలు అవమానించినా.. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోయినా జనసేనాని పవన్ మాత్రం తాజాగా తాను మార్చి 14న ఏర్పాటు చేయబోయే జనసేన ఆవిర్భావ సభాప్రాంగాణానికి ‘శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక’గా నామకరణం చేసి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. దామోదరం సంజీవయ్య కీర్తిని నలుచెరుగులా చాటాడు. తాజాగా ఈ దళిత దిగ్గజానికి అత్యున్నత గౌరవం కల్పించారు. పవన్ వేసిన ఈ అడుగు ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార వైసీపీని డిఫెన్స్ లో పడేసేలా ఉంది.

పేద దళిత కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి వెళ్లి, రాజకీయాల్లో కడవరకు నీతి, నిజాయితీలతో బతికిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య . ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలనే సంకల్పంతో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రాంగణానికి “శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక”గా నామకరణం చేశారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, పార్టీ భవిష్యత్తు కార్యచరణ ప్రకటించడం కోసం ఒక రాజకీయ పార్టీగా సభను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇన్ని ఇబ్బందులు, ఆటంకాలు కల్పించడం చాలా దురదృష్టకరమన్నారు. గత నెల 28వ తేదీన సభకు అనుమతి, బందోబస్తు కోసం డీజీపీ కార్యాలయానికి లెటర్ రాస్తే ఇప్పటి కి అనుమతి లభించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. నాదెండ్ల చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనమైంది.
ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో దళితులకు రాజ్యాధికారం వచ్చింది వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అందులో ముఖ్యుడు దామోదరం సంజీవయ్య. ఉమ్మడి ఏపీకి రెండేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండేళ్లలోనే ప్రజాహిత పనులు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ దళిత నేత.. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతల పాలిటిక్స్ కు పదవి కోల్పోయాడు. ఆ తర్వాత ఈ దళిత నేతను అటు కాంగ్రెస్ ఇతర పార్టీలు పట్టించుకున్న పాపాన పోలేదు.
పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ఈ దళితదిగ్గజాన్ని ఓన్ చేసుకోవడంతో దళిత వర్గాలన్నీ ఇప్పుడు జనసేన వైపే చూస్తున్నాయి. ఈ మేరకు దామోదరం సంజీవయ్య సభా ప్రాంగణం ఇప్పుడు పవన్ చేసే వ్యాఖ్యలతో మారుమోగనుంది. పవన్ చేసిన ప్రకటన మిగతా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఏపీలో మెజార్టీ ప్రజల్లో కాపులు, దళితులే. ఇప్పటికే కాపులను తనవైపు తిప్పుకున్న పవన్ ఇప్పుడు మెజార్టీగా ఉన్న దళితులను ఆకర్షించే పనిలో పడ్డారు.అందుకే తాజాగా జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణానికి ‘దామోదరం’ పేరుతో మరో సంచలన అడుగులు వేశారు. ప్రత్యర్థి పార్టీలను డిఫెన్స్ లో పడేశారు.
దళితుల ఆశాజ్యోతి దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిమాండ్ చేశారు. ఒక హక్కుగా తాము ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే తానే అధికారంలోకి వచ్చాక కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు మారుస్తామని పవన్ సంచలన ప్రకటన చేశారు. అందుకు కట్టుబడి ఉన్నామని పవన్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వమైనా ఆ మహా మనిషికి గౌరవం ఇవ్వాలని.. కడప జిల్లాను వైఎస్ఆర్ కడపగా మార్చినట్టే కర్నూలును మార్చాలన్న పవన్ డిమాండ్ ఇప్పుడు సంచలనమైంది. తాజాగా ఆయనను మరవకుండా ఏకంగా సభా ప్రాంగణానికి పేరు పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. ఆయనను గుర్తించేలా పవన్ పరోక్షంగా ఓన్ చేసుకొని ‘కర్నూలు జిల్లాకు దామోదరం’ పేరును ఖచ్చితంగా పెట్టేలా ఈ సంచలన అడుగులు వేశారు. ఈ పరిణామం ఖచ్చితంగా ఏపీరాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.